Mahesh – Balakrishna: మహేష్ త్రివిక్రమ్ మూవీ వీరసింహారెడ్డి మధ్య లింక్ ఇదే!

Mahesh – Balakrishna: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గతేడాది సర్కారు వారి పాట సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక ఈ సినిమా తర్వాత ఈయన మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో రాబోయే సినిమా షూటింగ్ తో బిజీ కానున్నారు. ఇలా వరుస సినిమాలతో మహేష్ బాబు ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే తాజాగా మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాకు సంబంధం ఉందని తెలుస్తుంది. ఇలా మహేష్ సినిమాకి బాలకృష్ణ సినిమాకు మధ్య సంబంధం ఏంటి అనే విషయాన్నికి వస్తే వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ తండ్రి కొడుకుల పాత్రలో నటిస్తూ సందడి చేశారు. అయితే మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోయే సినిమాల్లో కూడా ఇలాగే మహేష్ బాబు ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారని సమాచారం..

మహేష్ బాబు ఇప్పటివరకు నటించిన సినిమాలన్ని కూడా ఒకే తరహా పాత్రలలో నటిస్తూ వస్తున్నారని విమర్శలు ఉన్నాయి అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో రాబోతున్న సినిమాలో కాస్త విభిన్నంగా కనిపించాలని భావించారట. ఈ క్రమంలోని ఈ సినిమాలో ఈయన తండ్రి కొడుకుల పాత్రలలో నటించబోతున్నారని సమాచారం. ఇలా ఈ సినిమాలో ఈయన కొత్తగా ట్రై చేస్తున్నారని తెలుస్తోంది.

వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ తండ్రి కొడుకులు పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. మరి మహేష్ బాబు అలాగే తండ్రి కొడుకుల పాత్రలలో నటించి మెప్పిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయంలో నటిస్తారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంపై చిత్ర బృందం ఏ విధంగాను స్పందించలేదు. అయితే ఇదివరకే ఎస్ జే సూర్య దర్శకత్వంలో మహేష్ నటించిన నాని సినిమాలో ఈయన కొన్ని సన్నివేశాలలో తండ్రి కొడుకుల పాత్రలలో నటించారు. కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మరి మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

AP Elections: ఏపీ ఎన్నికలలో వారసులు హిట్టా..? ఫట్టా..? ప్రజలు వీరిని ఆదరించడం సాధ్యమేనా?

AP Elections:  ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈసారి వారసులకు పెద్దపీట వేశారు. ఇప్పటికే అధికార పక్షంలోనూ అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల వారసులకు పలు ప్రాంతాలలో టికెట్లు ఇచ్చారు. ఈ...
- Advertisement -
- Advertisement -