Movies: ప్రేక్షకులను అలరించడానికి ఈ వారం వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‎ల జాబితా ఇదే!

Movies: సినీ ప్రేక్షకులను ఎప్పుడూ అలరించడానికి ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తూనే ఉంటాయి. ఇక థియేర్లలో సందడి చేయడానికి కొన్ని సినిమాలు వస్తుంటే, ఓటీటీలో సత్తా చాటడానికి మరికొన్ని సినిమాలు ఈ వారం రాబోతున్నాయి. వీటికి ఏమాత్రం తగ్గకుండా వెబ్ సిరీస్ లు కూడా వచ్చేస్తున్నాయి. మరి ఈ వారం ఏఏ సినిమాలు రాబోతున్నాయో, ఏఏ వెబ్ సిరీస్ లో ఏఏ ఓటీటీ ప్లాట్ ఫాంల ద్వారా విడుదల అవుతున్నాయో చూద్దాం.

 

మసూద సినిమా:
సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ నటించిన మసూద సినిమా ఈ వారంలో విడుదల కానుంది. సాయి కిరణ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా నవంబర్ 18, 2022న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది.

 

గాలోడు సినిమా:
బుల్లితెర ద్వారా బాగా పాపులారిటీ సంపాదించిన సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కిన ‘గాలోడు’ సినిమా ఈ వారం థియేటర్లలో విడుదల కానుంది. గెహన సిప్పీ, సప్తగిరి, షకలక శంకర్, పృథ్వీలు నటించిన ఈ సినిమాకు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహిస్తుండగా.. నవంబర్ 18, 2022న విడుదల కానుంది.

 

అలిపిరి అల్లంత దూరంలో సినిమా:
ఎన్. రావన్ రెడ్డి. శ్రీనిఖిత, అలంకృత షాలు నటించిన ‘అలిపిరి అల్లంత దూరంలో’ సినిమా ఈనెల 18న విడుదల కానుంది. ఆనంద్ జె ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

 

సీతారామపురంలో ఒక ప్రేమ జంట సినిమా:
చిన్న సినిమాల జాబితాలో ఈవారం మరో సినిమా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. రణధీర్, నందిని రెడ్డి, సుమన్ లు నటించిన ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’ సినిమా ఈనెల 18న థియేటర్లలో విడుదల కానుంది.

 

దృశ్యం2 హిందీ సినిమా:
హిందీలో హిట్ అయిన దృశ్యంకు సీక్వెల్ గా దృశ్యం2 ఈనెల 18న థియేటర్లలో సందడి చేయనుండి. అజయ్ దేవ్ గణ్, టబు, అక్షయ్ ఖన్నా, శ్రియలు నటించిన ఈ సినిమాకు అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించాడు.

 

అహనా పెళ్లంట వెబ్ సిరీస్:
రాజ్ తరుణ్, శివానీ రాజశేకర్, హర్షవర్ధన్, ఆమని, పోసానిలు నటించిన ‘అహనా పెళ్లంట’ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5లో ఈ నెల 17 నుండి అందుబాటులో ఉండనుంది. ఈ వెబ్ సిరీస్ కు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు.

 

ఓటీటీలోకి సర్దార్ సినిమా:
కార్తి, రాశీఖన్నా, రజీషా విజయన్ నటించిన.. పి.ఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ‘సర్దార్’ సినిమా ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో ఈనెల 18 నుండి స్ట్రీమింగ్ కానుంది.

 

ఓటీటీలో చిరు ‘గాడ్ ఫాదర్’:
చిరంజీవి, నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్ లు నటించిన.. మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సినిమా ఈ వారం ఓటీటీలో రానుంది. ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో ఈనెల 19 నుండి స్ట్రీమింగ్ కానుంది.

 

వీటితో పాటు పలు ఓటీటీ ప్లాట్ ఫాంలపై ఈ వారం విడుదలవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు ఇవే..

 

ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్నవి ఇవే:
ది వండర్ (హాలీవుడ్) – 16 నవంబర్, 2022
1899 (హాలీవుడ్) – 17 నవంబర్, 2022
రిటర్న్ టు క్రిస్మస్ క్రీక్ (హాలీవుడ్) – 17 నవంబర్, 2022
ఇలైట్ (హాలీవుడ్) – 18 నవంబర్, 2022
స్లంబర్ ల్యాండ్ (హాలీవుడ్) – 18 నవంబర్, 2022

 

అమెజాన్ ప్రైమ్ లో వచ్చేవి ఇవే:

హాస్టల్ డేజ్ సీజన్ 3 (వెబ్ సిరీస్ హిందీ) – 16 నవంబర్, 2022
ది సెక్స్ లైఫ్ ఆఫ్ కాలేజ్ గర్ల్స్ (వెబ్ సిరీస్ ) – 18 నవంబర్, 2022

 

డిస్నీ+హాట్ స్టార్ లో రాబోతున్నవి ఇవే:

ఇరవతం (తమిళ్/తెలుగు) – 17 నవంబర్, 2022
సీతారామం (తమిళ్) – 18 నవంబర్, 2022

 

సోనీ లివ్ లో రాబోతున్నవి ఇవే:

అనల్ మీలే పని తెలి (తమిళ్) – 18 నవంబర్, 2022
వండర్ ఉమెన్ (తెలుగు) – 18 నవంబర్, 2022

Related Articles

ట్రేండింగ్

CM Jagan: సీఎం జగన్ కు ఆ ఎన్నికలంటే భయమా.. ఏం జరిగిందంటే?

CM Jagan: ఏపీలో కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఎన్నికలను నిర్వహించడానికి జగన్ సర్కారు వెనుకడుగు వేస్తోందని తెలుస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా ఎన్నికల గురించి...
- Advertisement -
- Advertisement -