Avinash: అవినాష్ కేసుకు సంబంధించి మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇదే!

Avinash: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైయస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు కాస్త ఉపశమనం కలిగించింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కి అప్లై చేసుకోగా తెలంగాణ హైకోర్టు బెయిల్ ప్రకటిస్తూ ఉత్తర్వులు వెల్లడించిన విషయం మనకు తెలిసిందే. ఇలా కోర్టు తీర్పుతో అవినాష్ రెడ్డి కాస్త ఉపశమనం పొందారని చెప్పాలి. అయితే అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది.

అవినాష్ రెడ్డి గత కొద్దిరోజులుగా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈయనని ఏ క్షణానైనా అధికారులు అరెస్టు చేయవచ్చని తెలియడంతో తన తల్లి అనారోగ్యానికి గురయ్యారు దీంతో ఈమెను గత కొద్దిరోజులుగా కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో తనని హైదరాబాద్ ఎఐజి ఆసుపత్రికి తరలించారు.

 

ఇలా ఈ హాస్పిటల్లో కొద్ది రోజులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు ప్రకటించారు అయితే అవినాష్ రెడ్డికి ఎప్పుడైతే బెయిల్ మంజూరు అయిందో ఆ నిమిషంలోనే ఈమెను కూడా వైద్యులు డిశ్చార్జ్ చేస్తున్నట్లు ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏఐజీలో కొద్దిరోజుల పాటు అడ్మిట్ కావాలని వైద్యులు ప్రకటించారు. అయితేఅవినాష్ రెడ్డికి బెయిల్ రాగానే తన ఆరోగ్యం కూడా కుదుటపడడం ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

 

అవినాష్ రెడ్డి సిబిఐ అధికారుల ఎదుట హాజరు కావడం కోసం పులివెందుల నుంచి బయలుదేరుతూ ఉండగా మార్గ పద్యమంలోకి రాగానే తన తల్లి శ్రీలక్ష్మికి అనారోగ్యం చేసిందని చెప్పడంతో వెనుతిరిగిపోయారు. అనంతరం కర్నూలులో ఉన్నటువంటి ఈమె హైదరాబాద్ కి తరలించారు. కానీ అవినాష్ రెడ్డికి బెయిల్ రాగానే ఈమెనూ డిశ్చార్జ్ చేయడం తన తల్లిని తీసుకొని అవినాష్ రెడ్డి పులివెందులకు రావడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర జరిగిందని పలువురు ఈ ఘటనపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -