Tirumala: తిరుమలలో చోటు చేసుకున్న అద్భుతం ఇదే.. గ్రేట్ అంటూ?

Tirumala: భారతదేశంలో అనేక రకాల హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు జీవిస్తుంటారు అన్న విషయం తెలిసిందే. భారతదేశంలోని చాలా ప్రదేశాలలో కులమత బేధాలు లేకుండా అన్ని మతాలవారు అన్ని కులాల వారు అన్నదమ్ములుగా కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ నుంచి క్రిస్మస్ పండుగ వరకు తమ తమ మతాలకు ప్రాధాన్యతను ఇస్తూనే ఇతర మతస్తుల పండుగలను కూడా గౌరవిస్తూ వారి పండుగ సందర్భాలలో కూడా పాల్గొంటూ ఉంటారు.

 

హిందువుల ఇళ్లలో పండుగలు జరిగినప్పుడు తినే ఆహార పదార్థాలు ఇచ్చుపుచ్చుకోవడాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే వారు పండుగలు జరుపుకున్నప్పుడు హిందువులకు ఆ ప్రసాదాలను ఇస్తూ ఉంటారు. ఇకపోతే అసలు విషయంలోకి వెళ్తే.. హిందువులకు అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమైన అతి పెద్దగా పండుగలలో ఉగాది పండుగ కూడా ఒకటి. అంతేకాకుండా చాలామంది హిందువులు ఉగాది పండుగ తోనే అసలైన న్యూ ఇయర్ వచ్చింది అని అంటూ ఉంటారు. ఈ ఉగాది పండుగను రెండు తెలుగు రాష్ట్రాల హిందువులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు.

అదే విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఈ పండుగను ముస్లింలు కూడా జరుపుకుంటారు. ఉగాది పండుగను ముస్లింలు జరుపుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా! మీరు విన్నది నిజమే.. కడప జిల్లాలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో ఉగాది పండుగ రోజున హిందువులతో పాటు ముస్లిం భక్తులు కూడా పెద్ద ఎత్తున దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. చెప్పాలి అంటే ఉగాది పండుగ రోజున హిందువులతో పోల్చుకుంటే ముస్లింలే ఎక్కువగా ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వస్తూ ఉంటారు. ఇలా హిందువులు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం వెనుక పురాణాలు కథలు కూడా ఉన్నాయి.

 

వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతికి.. గోదాదేవి లక్ష్మీదేవి అనే పేర్లు ఉన్నాయి. ముస్లిం వారు బీబీ నాంచారమ్మ వారి దేవతగా భావిస్తూ ఉంటారు. బీబీ నాంచారి వెంకటేశ్వర స్వామిని పెళ్లి చేసుకుంది కాబట్టి ముస్లింలు వెంకటేశ్వర స్వామి వారి ఇంటికి అల్లుడుగా భావిస్తూ ఉంటారు. దాంతో ప్రతి ఏడాది ఉగాది పండుగ రోజున వెంకటేశ్వర స్వామి గుడిని దర్శించి బియ్యం, పప్పులు, కూరగాయలు ఆకుకూరలు తీసుకువచ్చి వెంకన్నకు నైవేద్యాలుగా సమర్పిస్తూ ఉంటారు. ఇదే ఆచారం అక్కడ కొన్ని ఏళ్ల తరబడి వస్తోందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అంతే కాకుండా అక్కడ స్వామివారిని దర్శించుకున్న ముస్లిం వారు సైతం అలా దర్శించుకోవడం ద్వారా వారి కోరికలు నెరవేరుతున్నాయని వారు చెబుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -