Tarak: తారక్ డబ్బులు తీసుకోకుండా నటించిన సినిమా ఇదే!

Tarak: సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు అంతా క్రేజీ కాంబినేషన్లు కనిపిస్తున్నాయి. మల్టీ స్టారర్ మూవీస్ కు ప్రత్యేక డిమాండ్ ఉంది. సినిమాల్లో క్రేజీ కాంబినేషన్లు వ‌స్తే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. అది ఇవాళ్టి ట్రెండ్. అయితే అప్పట్లో గెస్ట్ రోల్ చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. ఒక సినిమాలో మరో పెద్ద హీరోనో, లేకుంటే స్టార్ ఆర్టిస్టో గెస్ట్ రోల్ చేస్తే మంచి టాక్ వచ్చేది. అందుకే ఆ రోజుల్లో ఆ ప్రయోగం ఎక్కువ చేసేవారు.

 

అప్పట్లో విక్టరీ వెంకటేష్ నటించిన చింతకాయల రవి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందులో అనుష్క, మమతా మోహన్ దాస్ హీరోయిన్లుగా చేశారు. గెస్ట్ రోల్ లో హీరో వేణు కనిపించారు. అలాగే ఓ పాటలో స్పెషట్ అట్రాక్షన్ గా జూనియర్ ఎన్టీఆర్ కనిపించారు. భల్లే భల్లే అని సాగే ఆ పాట ఎన్టీఆర్ స్టెప్పులతో హోరెత్తింది.

 

సాధారణంగా ఒక సినిమాలో గెస్ట్ రోల్ చేసినా భారీగానే పారితోషికం అందుకుంటారు. అందుకే గెస్ట్ రోల్ లో కనిపించడానికి చాలా మంది సిద్ధంగా ఉండేవారు. కానీ తారక్ మాత్రం చింతకాయల రవి సినిమాకు గాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. జూనియర్ ఎన్టీఆర్ కు దగ్గబాటి వెంకటేష్ అంటే చాలా ఇష్టం. వీరి మధ్య మంచి స్నేహబంధం ఉంది.

 

విక్టరీ వెంకటేష్ రానాతో పాటు కుర్ర హీరోలను బాగా ఆదరిస్తుంటారు. వారితో కలిసిపోయి సరదాగా ఉంటారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, వరుణ్ తేజ్ వంటివారు వెంకీతో చాలా క్లోజ్ గా ఉంటారు. చింతకాయల రవి సినిమాలో కూడా ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేయడానికి కారణం వెంకీనే. ఆ సినిమాలో ఆ పాటకు తారక్ అందుకే రూపాయి కూడా తీసుకోలేదట. అదంతా కేవంలం వెంకటేష్ మీద ఉన్న ఇష్టంతోనే డబ్బులు తీసుకోకుండా ఈ సినిమాలో కనిపించారట. అయితే కమర్షియల్ గా చింతకాయల రవి సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -