Balayya: బాలయ్య మనస్సు గెలుచుకున్న వ్యక్తి ఇతనే.. ఏం చేశాడంటే?

Balayya: ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సరికొత్త కార్యక్రమాలతో దూసుకుపోతోంది. అందులో భాగంగానే ఇండియన్ ఐడల్ సీజన్2 షోను నిర్వహిస్తోంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది. గాల విత్ బాల అంటూ ఇండియన్ ఐడల్ సీజన్2 కంటెంస్టంట్లతో నందమూరి బాలయ్య సందడి చేశారు. సింగర్స్ తో ఆడుతూ పాడుతూ బాలయ్య హంగామా చేశారు.

 

సింగర్ గా సెలక్ట్ అయిన కార్తికేయ పెర్ఫార్మెన్స్ కు సంబంధించి ప్రోమోను ఆహా ఓటీటీ రిలీజ్ చేసింది. తన వయసేమో పదహారు, జోరేమో సెలయేరు, కార్తికేయ నీ ఫాలోయింగ్ ఏందయ్యా అంటూ బాలయ్య ఇంట్రడక్షన్ ఇస్తూ ప్రోమో సాగుతోంది. కార్తికేయ తన టాలెంట్ ను చూపించడానికి గిటార్ తో స్టేజీ మీదకు వచ్చి దుమ్ము లేపాడు. కేరాఫ్ కంచరపాలెం సినిమా నుంచి ఆశాపాశం సాంగ్ పాడి అందర్నీ ఆకట్టుకున్నాడు.

సింగర్ కార్తికేయ పాడిన ఆ పాట విన్నాక బాలయ్య అదిరిపోయే కాంప్లిమెంట్ ఇచ్చాడు. గుండె పిండేశావయ్యా అంటూ కార్తికేయను పొగిడేశారు. బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అంటూ బాలయ్య అంటే కార్తికేయ ఎనెర్జీ మామూలుగా లేదని హైలో ఉందని తమన్ పొగడ్తల వర్షం కురిపించారు. అక్కడే ఉన్న మరో జడ్జి కార్తిక్ కూడా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. యు హ్యావ్ మై హార్ట్, కీప్ ఇట్ సేఫ్ అంటూ బాలయ్య కార్తికేయ టీ షర్ట్ మీద బ్లాక్ మార్కర్ తో రాసి హైఫై ఇచ్చినట్లు ప్రోమోలో కనిపిస్తోంది.

 

ఆహా ఓటీటీ నిర్వహించిన ఇండియన్ ఐడల్ సీజన్2 కోసం చాలా మంది సింగర్స్ సెలెక్ట్ అయ్యారు. ఒక్కో సింగర్ ని బాలయ్య ద్వారా పరిచయం చేసే ప్రయత్నం ఆహా చేసింది. ఆ ఎపిసోడ్ కు గాల విత్ బాల అనే ట్యాగ్ ని ఇచ్చింది. అన్ స్టాపబుల్ షోలో ట్రెడిషనల్ గా కనిపించిన బాలయ్య ఈ షో ద్వారా మాత్రం కాస్త ట్రెండీ స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చి అభిమానులను ఉర్రూతలూగించారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -