Sreeleela: హీరోయిన్ శ్రీలీల రేంజ్ ఇదే.. ఒక్క పాటకు ఎంతంటే?

Sreeleela: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి సందడి సినిమాలో స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు,రోషన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే మొదటి సినిమా తోనే సూపర్ క్రేజ్ ను అందుకున్న శ్రీ లీల తన అందం, నటనతో ఎంతోమంది మనసులలో స్థానం సంపాదించుకుంది.

కాగా ప్రస్తుతం శ్రీ లీల వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ముద్దుగుమ్మ మహేష్ బాబు,పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ లాంటి హీరోల సినిమాలలో నటిస్తోంది. అలాగే బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో బాలయ్య బాబు కూతురుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఒక మాస్ సాంగ్ ను ఈ రోజు నుంచి రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. ముంబై నుంచి వచ్చిన డ్యాన్సర్లు, లోకల్ జూనియర్ ఆర్టిస్ట్ లు ఇలా వందలాది మందితో ఓ మాస్ సాంగ్ ను పిక్చరైజ్ చేస్తున్నారు.

 

దాదాపు నాలుగైదు రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ జరగబోతోంది. సినిమాలో ఓ ఉత్సవం సందర్భంగా ఈ మాంచి మాస్ బీట్ వస్తుందని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ పాట కోసం అనిల్ రావిపూడి భారీగా ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఒక్క పాట కోసం అయిదు కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అరేంజ్ మెంట్స్, కెమేరాలు, లైటింగ్, క్రేన్ ల దగ్గర నుంచి ముంబాయి డ్యాన్సర్లు , వాళ్ల ఫ్లయిట్ టికెట్ లు, అకామిడేషన్, ఫిలిం సిటీ ఫీజులు ఇలా అన్ని ఖర్చులు కలిపి అయిదు కోట్లు దాటవచ్చని సమాచారం.

 

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -