Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ బుడ్డోడు డైలాగ్ వెనుక అసలు కథ ఇదే!

Jr NTR: నందమూరి వారసుడిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం స్టార్‌ హీరోగా రాణిస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అనేక హిట్ చిత్రాలు ప్రేక్షకులకు అందించాడు. సీనియర్ ఎన్టీఆర్ మాదిరే నటనలో మంచి మార్కులు కొట్టేశాడు జూనియర్‌ ఎన్టీఆర్. గంభీరమైన ఆహార్యం, అదిరిపోయే స్టెప్పులు వేయడం జూనియర్ ఎన్టీఆర్ స్పెషాలిటీ.

 

సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో చాలా అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్న తారక్‌.. తర్వాత నిలదొక్కుకున్నాడు. స్టార్టింగ్ చిత్రాలు నిన్ను చూడాలని, రాఖీ సినిమాల్లో లావుగా కనిపించిన ఎన్టీఆర్.. యమదొంగ, కంత్రీ సినిమాల టైమ్ కి సన్నబడ్డాడు. సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ పలు సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్లు కూడా కొట్టాడు. తాజాగా రిలీజైన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సీఫీసును బద్దలు కొట్టింది. రికార్డులు తిరగరాసింది.

 

జూనియర్‌ ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన ఆసక్తికర ఘటన ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. నందమూరి హరికృష్ణ రెండో భార్య కుమారుడైన జూనియర్‌ ఎన్టీఆర్‌.. తొలుత ఇండస్ట్రీలో సెటిల్‌ అవడానికి కాస్త కష్టపడాల్సి వచ్చింది. తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన అందరికంటే జూనియర్‌ ఎన్టీఆర్‌కే ప్రస్తుతం ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగింది.

 

ఆ మూవీ డైలాగ్‌తో చెక్‌ పెట్టిన తారక్‌..
ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా ఉన్న ఓ వ్యక్తి ఒకప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ను తీవ్రంగా అవమానించాడట. అందరి ముందే పొట్టోడు అంటూ ఎన్టీఆర్‌ను గేలి చేశాడట. అవమానించిన సదరు హీరో.. నందమూరి ఫ్యామిలీకి దగ్గర కావడంతో ఏమీచేయలేని స్థితిలో ఉండిపోయాడటన యంగ్‌ టైగర్‌. ఈ అవమానాన్ని దృష్టిలో పెట్టుకున్న ఎన్టీఆర్‌.. తన సినిమాలో డైలాగ్‌ పెట్టుకొని పగ తీర్చుకున్నట్లు తెలుస్తోంది. తన మూవీ డైలాగ్‌తో గట్టి కౌంటర్‌ ఇచ్చాడట. జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ఓ సినిమాలో బుడ్డోడు, బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతానంటూ ఓ డైలాగ్‌ ఉంటుంది. ఈ డైలాగ్‌ రాయించుకోవడానికి గల కారణం అదేనని ప్రచారం జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -