Upasana: నేను పిల్లల్ని కనడానికి కారణమిదే.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Upasana: మెగా కోడలు ఉపాసన తల్లి కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఉపాసన రాంచరణ్ పెళ్లి జరిగి పది సంవత్సరాలు అయినప్పటికీ వీరిద్దరూ ఇప్పుడు పిల్లలను ప్లాన్ చేశారు. ఇలా ఉపాసన ప్రస్తుతం తల్లి కాబోతున్న నేపథ్యంలో ఇటు మెగా కుటుంబం మెగా ఫ్యామిలీ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఉపాసన ప్రెగ్నెంట్ అనే విషయం తెలియడంతో ఆమె ప్రెగ్నెన్సీ గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఉపాసన సరోగసి ద్వారా పిల్లలకు జన్మనివ్వబోతున్నారు అంటూ కూడా కామెంట్లు వినిపించాయి. అందుకు గల కారణం ఈమె లూస్ అవుట్ ఫిట్ ధరించడంతో తన బేబీ బంప్ కనిపించేది కాదు. దీంతో పెద్ద ఎత్తున ఈమె ప్రెగ్నెన్సీ గురించి వార్తలు వచ్చాయి. ఇక ఉపాసన తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలతో పాటు తన బేబీ షవర్ వేడుకలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వచ్చారు. మదర్స్ డే సందర్భంగా తన ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.

 

ఈ ఫోటోలో ఉపాసన బేబీ బంప్ చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇక ఈ ఫోటోని ఉపాసన షేర్ చేస్తూ మదర్స్ డే సందర్భంగా ఒక పోస్ట్ కూడా చేశారు. ఇందులో భాగంగా తాను తన వారసత్వాన్ని నిలబెట్టడం కోసం తల్లి కావడం లేదని అలాగే తన వివాహ బంధాన్ని బలోపేతం చేయడానికి తల్లి కావడం లేదని తెలియజేశారు. పుట్టబోయే తన బిడ్డకు అంతులేని ప్రేమను అందించగలననీ,తనని బాధ్యతగా చూసుకోగలనని మానసికంగా సిద్ధపడిన తర్వాతే తాను తల్లిని కావాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ ఈ సందర్భంగా ఉపాసన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -