Prabhas: స్టార్ డైరెక్టర్లు ప్రభాస్‌ను నమ్మడానికి కారణమిదే!

Prabhas: బహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ రేంజే మారిపోయింది. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌తో సినిమాలు తీసేందుకు డైరెక్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాహో, రాధేశ్యామ్ ఫ్లాపులు అయిన తర్వాత కూడా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పుకోవచ్చు. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్‌లు పూర్తి చేసి.. మరో మూడో సినిమాకు ఓకే చెప్పాడు. ఆదిపురుష్, సలార్ సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలి ఉండగా.. స్పిరిట్, రాజా డీలక్స్ సినిమాల గురించిన అప్‌డేట్స్ ఇంకా రావాల్సి ఉంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందని సమాచారం.

 

 

కేజీఎఫ్‌ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘సలార్’ మూవీకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అందరి కళ్లు ఈ సినిమాపైనే ఉన్నాయి. వరుస అపజయాలతో ఉన్న ప్రభాస్‌కు ఈ సినిమా తప్పనిసరిగా హిట్ ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు విడుదల అయ్యాయి. సినీ క్రిటిక్స్, పలువురు సినిమాపై ఇచ్చిన ఫస్ట్ రివ్యూస్.. ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచాయి. వచ్చే ఏడాది ప్రభాస్ కచ్చితంగా హిట్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా ప్రభాస్‌కు చెందిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ ఇండస్ట్రీలో మరే హీరోకి కేటాయించని విధంగా నిర్మాతలు సినిమాకు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ప్రభాస్ ప్రతీ సినిమాకు రూ.300 నుంచి రూ.400 కోట్ల బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల బడ్జెట్ ఏకంగా రూ.3000 కోట్లు కావడం గమనార్హం. ఇంత భారీ బడ్జెట్‌తో మరే హీరోతో సినిమాలను నిర్మాతలు నిర్మించలేదు. ప్రభాస్‌కు అంతటి క్రేజ్ ఉంది కాబట్టే.. నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. ఇలాంటి రికార్డు కేవలం ప్రభాస్‌కు మాత్రమే సొంతమని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -