Sania Mirza: సానిమా మీర్జా విడాకుల విషయంలో వాస్తవాలు ఇవే!

Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ కాపురంలో కలతలు మొదలయ్యాయని, త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని కథనాలు ప్రచూరితం అవుతున్నాయి. సానియా మీర్జా-షోయబ్ మాలిక్ 12 ఏళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. అప్పట్లో వీరిద్దరి వివాహం పెను సంచలనం సృష్టించింది. ఇండియన్ అయిన సానియా.. పాకిస్తానీ క్రికెటర్‌ను ఎలా పెళ్లి చేసుకుంటోందని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే గత కొద్దిరోజులుగా వీరి వైవాహిక జీవితంలో అడ్డుంకులు వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. షోయబ్ మాలిక్ పాకిస్తానీ నటి అయేషాతో ఎఫైర్ కొనసాగిస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సానియా తన భర్తతో గొడపడి.. విడాకులు ఇవ్వాలని కోరిందట. దాంతో ఇరు దేశాల్లో ఇదే హాట్ టాపిక్‌గా వినిపిస్తోంది.

 

కానీ ఇప్పుడు వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేవనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త సానియా-షోయబ్ మాలిక్ అభిమానులను సంతోష పెడుతోంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయన విషయంపై క్లారిటీ లేకపోయినా.. దాని కంటే సెస్సెషన్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. షోయబ్-సానియా ఇద్దరూ కలిసి ఓ రియాలిటీ షో చేయబోతున్నారట. వీరిద్దరూ కలిసి పాకిస్తానీ టీవీ కోసం ‘మీర్జామాలిక్’ షో చేయనున్నారు. త్వరలోనే ఈ షో ప్రారంభం కానుంది. వీరిద్దరూ కలిసి బుల్లితెరపై అలరించనున్నారు. అయితే ఈ షో.. సోనీ టీవీ సమర్పణలోని హిందీ కామెడీ టాక్ షో ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ తరహాలో ఉండబోతుందని సమాచారం.

 

 

మీర్జామాలిక్ షో ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుందట. ఈ షోలో ఇంటర్నేషనల్ క్రీడాకారులను గెస్టులుగా పిలవనున్నారట. వారి మనోగతాన్ని, జీవితంలో సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సమస్యలపై మాట్లాడనున్నారట. ఈ టాక్ షో కోసం సానియా మీర్జా-షోయబ్ మాలిక్ భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. అయితే విడాకుల మాట పక్కన పెడితే.. ఈ షోలో వీరిద్దరూ హోస్ట్ గా ముందుకు రావడం అందరిలో సంతోషాన్ని నింపుతోంది.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -