Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గురించి ప్రజల్లో ఉన్న అభిప్రాయమిదే!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ ఫుల్‌ జోష్‌లో రన్ అవుతోంది. ‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవన్.. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఏఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర.. రాబిన్‌ హుడ్‌ని పోలి ఉంటుందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో షూటింగ్‌ జరగగా.. సినిమాలోని పలు యుద్ధ సన్నివేశాలను షూట్ చేస్తున్నట్లు సమాచారం. షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు.. ప్రమోషనల్ ఈవెంట్స్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

 

 

ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లోనూ తన మార్క్‌ ను కంటిన్యూ చేస్తున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఎక్కువ శాతం ప్రజల్లో ఉండేలా చూసుకుంటారు. వీలు దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ.. మిగిలిన సమయాన్ని ప్రజలకు కేటాయిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సీఎం అవ్వాలని పవన్ కళ్యాణ్ భారీగానే శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్‌ది జాలి గుండె. సాయం కోసం అతని దగ్గరికి వచ్చిన వారిని కచ్ఛితంగా ఆదుకుంటారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు మొత్తాన్ని ప్రజల కోసమే ఖర్చు చేస్తాడని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. సంపాదన కోసమే రాజకీయాల్లోకి రావడం లేదని, ప్రజల క్షేమం కోసం రాజకీయాల్లో వచ్చాడని తెలుస్తోంది. అందుకే ఆయన సంపాదించిన మొత్తాన్ని ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్త నెట్టింట వైరల్ అవ్వడంతో.. పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -