Baba Vanga 2023 Predictions :2023లో జరగబోయేది ఇదే: బాబావంగా భవిష్యవాణి

Baba Vanga 2023 Predictions :బాబా వంగా అంటే తెలియని వారేవరూ ఉండరు. భవిష్యత్తును అంచనా వేస్తూ జరిగే పరిణామాలపై హెచ్చరించారు. బాబా వంగా చెప్పిన విషయాలు ఇప్పటికే కొన్ని నిజమయ్యాయి కూడా. దీంతో బాబా వంగా తన భవిష్యవాణిలో ఏం చెప్పారన్న అంశాలు తెలుసుకోవడానికి ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ప్రతీ ఏడాది బాబా వంగా భవిష్యవాణిలో ఏయే అంశాలు ఉన్నాయన్న విషయాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 2023 గురించి బాబా వంగా ఏం చెప్పారన్న దానికి సంబంధించి కథనాలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. బాబా వంగా ఉహించినదాంట్లో జీవ ఆయుధాలు ప్రధానమైంది. దీనినే బయో వెపన్స్గా పిలుస్తుంటారు. జీవ ఆయుధాలపై ప్రయోగాలు చేస్తున్న ఓ పెద్ద దేశం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు మరణిస్తారని ఆమె పేర్కొన్నారు.

గతేడాది ప్రపంచాన్ని అతలాకుతలం చేసినా కరోనా వైరస్‌ను చైనాలోని ఓ ల్యాబ్‌లో కృత్రిమంగా సృష్టించారని వచ్చిన విషయం అందిరకీ తెలిసిందే. రానున్న రోజుల్లో ప్రభుత్వాలు సహజ జననాలను నిషేధిస్తాయని బాబా వంగా అంచనా వేశారు. సహజ జననాలను పరిమితం చేస్తూ ఈ భూమిపైకి వచ్చే కొత్త జీవులను ల్యాబ్‌లో సృష్టిస్తారని ఆమె తన భవిష్యవాణిలో పేర్కొన్నారు. 2023లో అణు ప్లాంట్ల విస్పోటనాలు భారీగా జరిగే అవకాశం ఉందని బాబా వంగా అంచనా వేశారు ఇప్పటికే ఉక్రెయిన్, రష్యాల మధ్య నెలకొన్ని యుద్ధ వాతావరణం ఒకానొక సమయంలో అణు ప్లాంట్లను పేల్చడం వరకు వెళ్లిన విషయం తెలిసిందే. బాబా వంగా చెప్పిన మరో అంశం 2023లో భూమి కక్ష్య మారుతుందని అంచనా వేశారు.

అయితే కచ్చితంగా కక్య మార్పు ఎలా ఉంటుందన్న విషయం తెలియకపోయినప్పటికీ.. అదేగనక జరిగితే స్పష్టి వినాశనానికి దారి తీస్తుందని చెప్పడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. భూమిపై ఇంతకు ముందెన్నడూ చూడని భారీ సౌర తుపాను వస్తుందనేది బాబా వంగా చెప్పిన మరో జోస్యం, ఒకవేళ సూర్యుడిపై నిజంగానే సౌర తుపాన్ వస్తే కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమై ప్రస్తుతం మన వినియోగిస్తున్న మొబైల్, ఇంటర్నెట్ సేవలు పూర్తిగా స్తంభించిపోతాయని జోస్యం చెప్పారు. ఇదిలా ఉంటే బాబా వంగా 2022లో చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో గణనీయమైన వరదలు సంభవిస్తాయని తెలిపారు. ఆమె చెప్పినట్లుగానే ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాలో భారీ వర్షాల కారణంగా వరదల సంభవించాయి. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు విజృంభిస్తుందని చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -