600 Marks: ప్రస్తుత కాలంలో పెద్ద ఎత్తున కార్పోరేట్ స్కూల్స్ రావడంతో చాలామంది కార్పొరేట్ పాఠశాలల్లో పిల్లలను చదివించడానికి ఇష్టపడుతున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత చదువులు చదువుతూ ఎంతోమంది గొప్ప ఉద్యోగాలలో స్థిరపడిన వారు ఉన్నారు.కష్టపడి చదవాలని ఆకాంక్ష ఆసక్తి ఉంటే ఎక్కడ చదివిన సరస్వతి దేవి అనుగ్రహం మనపై ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. ఈ క్రమంలోని తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి ఇంటర్ ఫలితాలలో అద్భుతం సృష్టించింది.
తమిళనాడుకు చెందిన నందిని అనే విద్యార్థి ఇంటర్ సెకండియర్ లో 600 కు గానూ 600 మార్కులు సంపాదించి అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది. అయితే ఇలా మార్కులు సాధించిన వారు చాలామంది ఉన్నారని చెప్పవచ్చు కానీ నందిని మాత్రం చాలా ప్రత్యేకం ఈమె చిన్నప్పటినుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ చదువులో రాణిస్తున్నారు. అంతేకాకుండా వీరి తల్లిదండ్రులు రోజువారీ కూలీలు ఇద్దరు రోజు పనికి వెళ్లందే పూట గడవని పరిస్థితి వీరిది.
ఇలా నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈ కూలి కూతురు చదువులో ఇలా మంచి మార్కులు సాధించడంతో ప్రతి ఒక్కరు ఈమె పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నందిని అన్నామలైయర్ మిల్స్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ గవర్నమెంట్ స్కూల్ లో చదివింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ రిజల్ట్ సోమవారం, మే8 న విడుదల చేసింది.
ఎకనామిక్స్, ఇంగ్లీష్, కామర్స్, అకౌంటెన్సీ, కంప్యూటర్ అప్లికేషన్ ఇలా ఆరు సబ్జెక్ట్స్ లో వందకు వంద మార్కులు సాధించడంతో విద్యార్థిపై ప్రతి ఒక్కరు ప్రశంశాలు కురిపించడమే కాకుండా తమ కూతురు ప్రతిభకు తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈ చదువుల తల్లి ఎందరికో ఆదర్శం అని చెప్పాలి.