Diabetes: ఇలా చేస్తే షుగర్‌ రాకుండా కాపాడుకోవచ్చు!

Diabetes: ప్రస్తుత కాలంలో రోజుకొక కొత్త కొత్త వ్యాధులు ప్రభలుతున్నాయి. వయస్సు బేధం లేకుండా అందరికీ వివిధ వ్యాధులు వ్యాపిస్తూ ఇక్కట్లకు గురి చేస్తున్నాయి. అయితే ఎక్కువ మంది డయాబెటిస్‌ బారిన పడి ఆస్పత్రులకు పరుగులు తీçస్తున్నారు. నేటి జీవన శైలిలో వచ్చిన మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవడం ఇలా ఎన్నో కారణాల వలన డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. అధిక బరువు ఉన్న వారికి డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఉంది.

 

ఓబీసిటీ కారణంగా ముఖం జబ్బలు పొట్ట లావుగా ఉంటాయి. అలాగే లివర్‌ కి కూడా ఫ్యాట్‌ పడుతుంది. లివర్‌ ఫ్యాట్‌ కావడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చేయలేకపోతోంది. మనం తీసుకున్న ఆహారం పొట్ట ప్రేగులను అరిగి చక్కెరగా మారుతుంది. రక్తంలో చేరి కణాలలోకి వెళుతుంది. చక్కెర కణాలలోకి వెళ్లాలంటే లివర్‌ కొన్ని ఎంజైమ్స్‌ విడుదల చేస్తుంది. ఒంట్లో కొవ్వు పేరు కోవడం వలన ఎంజైమ్స్‌ విడుదల కావు.

 

 

దీంతో రక్తంలో గ్లూకోస్‌ లెవెల్స్‌ పెరుగుతాయి. రక్తంలో గ్లూకోజ్‌ పెరగటానికి లివర్‌ ముఖ్య కారణం. లివర్‌ సరిగ్గా ఉంటే రక్తంలో గ్లూకోస్‌ లెవెల్స్‌ పెరగవు. లివర్‌ అలా అవడానికి ముఖ్య కారణం ఒబిసిటీ. ఒబిసిటీ అంటే ఉన్న దాని కంటే పది రెట్లు అధిక బరువు ఉండడం.

 

ఒబిసిటీ, ఫ్యాటీ లివర్‌ వలన డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే ఫ్యాట్‌ సెల్సో్ల ఫ్యాట్‌ ను తగ్గించుకోవడం ముఖ్యం. మన జీవన శైలిలో మార్పులు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

రోజుకి రెండుసార్లు తినాలి. ఉదయం పదకొండు గంటలకు భోజనం చేయాలి. ఈ భోజనంలో ఒకటి లేదా రెండు పుల్కాలు లేదా జొన్న రొట్టె, కర్రీస్‌ ని ఎక్కువగా తీసుకోవాలి. కర్రీ తోనే కడుపు నింపాలి. ఆ కర్రీస్‌ లో నూనె లేకుండా ఉప్పు తగ్గించుకొని తినాలి. ఉదయం తొమ్మిదిన్నర కల్లా ఏమైనా కావాలంటే వెజిటేబుల్‌ జ్యూస్‌ తీసుకోవడం మరీ మంచింది.

లేచిన తర్వాత నైట్‌ పడుకుని దాకా ఏ విధమైన ఆహారాలను తీసుకోకుండా కడుపు నీళ్లతోనే నింపాలి. నిరాహారిగా అలా ఉండడం చాలా మంచిది. సాయంత్రం 4–5 గంటల మధ్య కొబ్బరి నీళ్లు తాగడం, అరగంట తర్వాత మొలకలు, జామకాయలు, బాదం పప్పులు, వాల్‌ నట్లు, కర్పూజ, రేగి కాయ తింటుంటే ఫ్యాటీ లివర్‌ తగ్గి రక్తంలో గ్లూకోస్‌ లెవెల్స్‌ కూడా తగ్గిపోతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ కార్పొరేట్ విద్య అంటే ఇదేనా.. ఏకంగా ఇంత చేశారా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలలను కార్పొరేటర్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దామని నాడు నీడలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్నత చదువులు చదువుతున్నారు...
- Advertisement -
- Advertisement -