UP: భార్యపై ప్రేమతో భర్త చేసిన ఈ పనికి నిజంగా దండం పెట్టాల్సిందే!

UP: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రపంచ నలుమూలలా ఏది జరిగినా కూడా క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటుంది. దాంతో ప్రపంచంలో చిన్న సంఘటన జరిగినా కూడా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తర్వాత జనాలు కూడా అనేక విషయాలను తెలుసుకోగలుగుతున్నారు. నిత్యం కొన్ని వందల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే ఎన్నో రకాల వార్తలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి.

 

అయితే అందులో కొన్ని నవ్వులు తెప్పించేవి అయితే మరికొన్ని బాధ కలిగించేవి మరికొన్ని కోపం తెప్పించేవిగా ఉంటాయి. ఇంకొన్ని ఘటనలు అయితే ఆశ్చర్య పోయే విధంగా కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్లకు సంబంధించిన వీడియోలు, వార్తలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అటువంటిదే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటి అన్న విషయానికి వస్తే.. మామూలుగా దోమలు కుట్టడం అన్నది సహజం. మురికి ప్రదేశాలు నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా దోమలు చేరి దోమల కొడుతూ ఉంటాయి.

అయితే దోమలు కుడుతున్నాయి అంటే మస్కిటో బ్యాట్ లేదంటే మస్కిటో కిల్లర్, ఆల్ అవుట్ లాంటివి ఉపయోగించి దోమలు కుట్టకుండా చేసుకుంటాం.. ఇదే విషయం గురించి ఒక వ్యక్తి ఆశ్చర్యపరిచే విధంగా ఒక ట్వీట్ చేశాడు. అది కూడా ఏకంగా పోలీసులకు ట్వీట్ చేశాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఏమని ట్వీట్ చేశాడో తెలుసా.. ఉత్తరప్రదేశ్‎లోని సంభాల్ జిల్లాలో చందౌసిలోని హరి ప్రకాశ్ నర్సింగ్ హోంలో సోమవారం ఓ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం ఆ మహిళ తీవ్ర ఇబ్బందులు పడింది. ఓ పక్క డెలివరీ నొప్పులు ఉండగా మరోవైపు దోమలు కుడుతూ ఆమెతో పాటు పాపను కూడా ఇబ్బంది పెట్టాయి. దాంతో వెంటనే అతను మస్కిటో కాయిల్ కొనుక్కురావడం కోసం రోడ్డు మీదకు వెళ్లాడు. కానీ, ఎక్కడా షాపులు తెరచి లేవు.

 

దాంతో ఏం చేయాలో అర్థం కాక యూపీ పోలీసులకు ట్వీట్ చేశాడు. నా భార్య ఈరోజు చందౌసిలోని హరి ప్రకాష్ నర్సింగ్ హోమ్‎లో బిడ్డకి జన్మనిచ్చింది. కానీ నా భార్య ఇక్కడ చాలా ఇబ్బంది పడుతోంది. ఎందుకంటే ఆమెకు ప్రసవ వేదనతో పాటు దోమలు కూడా చాలా కుడుతున్నాయి. నా పాప కూడా దోమలు కుట్టడంతో బాగా ఏడుస్తోంది. దయచేసి నాకు అత్యవసరంగా మార్టిన్ కాయిల్ అందించండి అంటూ సంభాల్ పోలీస్ డయల్ 112 యూపి పోలీసులకు ట్యాగ్ చేశాడు. ఇక వెంటనే అది చూసిన యూపీ పోలీసులు వెంటనే స్పందించి అతనికి రెండు మస్కిటో కాయిల్స్ ఆస్పత్రికి చేరుకొని వారికి అందించారు. కష్టసమయంలో ఆదుకున్న పోలీసులకు అతను మళ్లీ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. దాంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శభాష్ యూపీ పోలీస్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..

Related Articles

ట్రేండింగ్

YS Avinash Reddy Vs YS Sunitha: అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ సునీత.. కడపలో వైసీపీ మునగటానికి ఇంకేం అక్కర్లేదా?

YS Avinash Reddy Vs YS Sunitha: కడప పార్లమెంట్ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. 2019 ఎన్నికలకు ముందు వయసు వివేకానంద రెడ్డి దారుణంగా హత్యకు...
- Advertisement -
- Advertisement -