Banks: వచ్చే వారంలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?

Banks: ప్రతి ఒక్కరూ దాదాపుగా బ్యాంకుల్లో లావాదేవీలు జరుపుతుంటారు. వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, దినసరి కూలీలు సైతం తమ సంపాదనను బ్యాంకుల్లో దాచుకుంటారు. బ్యాంకులకు సెలవులు వస్తున్నాయంటే ముందస్తుగా జాగ్రత్తలు పడి లావాదేవీలు జరుపుతుంటారు. అయితే నవంబర్‌ నెలలో ఎక్కువ సెలవులు ఉండటంతో వినియోగదారులు అలర్ట్‌ అవ్వాలని ఆయా బ్యాంకుల అధికారులు సూచిస్తున్నారు. బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సిన వినియోగదారులు మందుస్తుగా బ్యాంకులకు ఉండే సెలవులను గ్రహించుకుని లావాదేవీలు జరుపుకోవాలని సూచిస్తున్నారు.

ఈ నెల 8న గురునానక్‌ జయంతి పురస్కరించుకుని బ్యాంకులకు సెలవు ఉంటుంది. కాబట్టి ముందస్తుగా వినియోగదారులు ఎలాంటి లావాదేవీలున్నా జాగ్రత్తలు పడాలి.ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా సెలవులు ఉండవు. కొన్ని ప్రాంతాల్లో సెలవులు ఉండొచ్చు.. మరికొన్ని ప్రాంతాల్లో క్లోజ్‌లో ఉంటాయి. తెలంగాణలో చూస్తే గురునానక్‌ జయంతి, కార్తీక పూర్ణిమ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. అందుకే తెలంగాణ వాసులు అలర్ట్‌ ఉండాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే గురునానక్‌ జయంతి, కార్తిక పౌర్ణమి సందర్భంగా ఎలాంటి సెలవులు ఉండవు. ఆ రోజుల్లోనూ యథావిధిగా బ్యాంకులు పని చేస్తాయి.

గురునానక్‌ జయంతితో పాటు మరో సెలవు కూడా ఉంది. వచ్చే వారంలో రెండవ శనివారం కూడా సెలవు ఉంటుంది. ఆ తర్వాతి రోజు ఆదివారం యథావిధిగా సెలవు ఉంటుంది. మొత్తం కలిపితే వచ్చేవారంతో మూడ్రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. దీంతో నవంబర్‌లో లావాదేవీలు జరిపే వారు ముందస్తు సెలవును గ్రహించి బ్యాంకులకు వెళ్లాలని సూచిస్తున్నారు. అన్ని నెలల్లో ఇలాగే ఉండవని అప్పుడప్పుడు వరస సెలవులు వస్తాయని అందుకే బ్యాంకు వినియోగదారులు ముందస్తుగా లావాదేవీలు జరుపుకోవాలని సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని జగన్.. ఇంతకంటే ఘోరం ఉందా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో భాగంగా పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలను ఇచ్చారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు భారీ స్థాయిలో ఎన్నికల హామీలను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి...
- Advertisement -
- Advertisement -