Delhi: ఆరేళ్ల చిన్నారిని ఏడాదినుంచి బెదిరిస్తూ అలా.. చివరికి?

Delhi: సమాజంలో కామందుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. వావివరస, చిన్న పెద్ద అని తేడా మరిచి స్త్రీలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. 9 నెలల పసికందు నుంచి 80 ఏళ్ల పండు ముసలి వారి వరకు ఏ ఒక్కరిని విడిచిపెట్టడం లేదు. కొంతమంది అత్యాచారం చేస్తుంటే మరి కొంతమంది అంతటితో ఆగకుండా వాటిని కిరాతంగా దారుణంగా కొట్టి చంపేస్తున్నారు. తల్లి చెల్లి అక్క ఇలా వావి వరసలు లేకుండా వారిపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు కామాంధులు. దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో స్త్రీలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.

అయినప్పటికీ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో కామాంధుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తాజాగా అలాంటి ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని ఒక చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఒక కామాంధుడు. ఆ వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో ఒక దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 6 ఏళ్ల పాప కూడా ఉంది. ఆ కూతురుని స్థానికంగా ఉండే ఒక స్కూల్ లో జాయిన్ చేశారు. అయితే కూతురుని ప్రతిరోజూ స్కూల్ కు తీసుకపోవడం, ఇంటికి తీసుకరావడం కోసం ఒక క్యాబ్ డ్రైవర్ ను మాట్లాడుకున్నారు.

 

దాంతో ఆ వ్యక్తి ఏడాది కాలంగా ఆ బాలికను స్కూల్ కు తీసుకొని వెళుతూ ఇంటికి తీసుకొచ్చేవాడు. అలా ఈ ఏడాది కాలంలో క్యాబ్ డ్రైవర్ అభం, శుభం తెలియని ఆ చిన్నారిపై దారుణానికి పాల్పడ్డాడు. లైంగికంగా వేధిస్తూ ఆ చిన్నారి ప్రైవేట్ పార్ట్ లను తాకేవాడు. అయితే ఇదే విషయం ఆ చిన్నారి ఇటీవల తన తల్లికి వివరించింది. కూతురు మాటలు విన్న ఆ తల్లి ఒక్కసారిగా కోపంతో ఊగిపోయింది. వెంటనే ఆ క్యాబ్ డ్రైవర్ దారుణంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుర్మార్గుడు ఆ క్యాబ్ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -