CM KCR: కేసీఆర్ బీఆర్ఎస్‌ కు ఈసీ షాక్.. ఆ పేరు మీదే మూడు పార్టీలు

CM KCR: విజయదశమి రోజున టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మారుస్తూ సీఎం కేసీఆర్ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దాదాపు 285 టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు సంతకాలు చేసిన బీఆర్ఎస్ పేరుకు ఓకే చెప్పారు. టీఆర్ఎస్ నేతలు చేసిన ఈ తీర్మానాన్ని ఈసీకి అందించేందుకు బుధవారం సాయంత్రం టీఆర్ఎస్ ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లారు. గురువారం టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ చేసిన తీర్మానాన్ని ఈసీకి అందించారు. టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో పాటు టీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు ఈసీనిగురువారం కలిసి తీర్మానం కాపీని అందించారు.

తమ పార్టీని పేరును బీఆర్ఎస్ గా మార్చాలని,దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టాలని కోరారు. కానీ ఈసీ బిగ్ షాకిచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పేరు మీద ఇప్పటికే దేశంలో మూడు పార్టీలు ఉన్నాయని, మార్చడం కుదరదని చెప్పినట్లు సమాచారం. మూడు పార్టీలు అదే పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉన్నందుున మరో పార్టీనే రిజిస్టర్ చేయడం కుదరదని ఈసీ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ నమోదు విషయంలో పునరాలోచించినిర్ణయం తీసుకుంటామని ఈసీ అధికారులు చెప్పినట్లు చెబుతున్నారు.

ఇప్పటికే భారత్ రాష్ట్ర సమానతవాద పార్టీ,బహుజన్ రిపబ్లిక్ సోషలిస్ట్ పార్టీ, బహుజన్ రాష్ట్ర సమితి పార్టీలు ఈసీ వద్ద రిజిస్టర్ అయ్యాయి. ఆ పార్టీలు ఈసీ నిబంధనల ప్రకారం యాక్టివ్ గానే పనిచేస్తున్నాయి. భారతరాష్ట్ర సమానతవాద పార్టీ జైపూర్ నుంచి, బహుజన్ రిపబ్లిక్ పార్టీ ముంబై నుంచి, బహుజర్ రాష్ట్ర సమితి పార్టీలు సికింద్రాబాద నుంచి నమోదు అయి ఉన్నాయి. అందుకే బీఆర్ఎస్ పేరు నమోదుపై ఈసీ నమోదు చేసేందుకు వెంటనే ఒప్పుకోలేదని, పరిశీలన చెపట్టిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి అదిలోని షాక్ తగిలినట్ల తెలుస్తోంది.

ఒకవేళ పార్టీ పేరు మార్చినా.. గుర్తు, జెండా అవే ఉంటాయనే, వాటినే ఈసీ కొనసాగిస్తుందని చెప్పలేమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే టీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. మొదటికే మోసం వస్తుందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ పేరు మార్పుకు సంబంధించి ఈసీ నుంచి అనుమతి వచ్చాన తర్వాతే టీఆర్ఎస్ జెండా మార్పుపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. టీఆర్ఎస్ జెండాలో తెలంగాణ మ్యాప్ స్థానంలో భారత మ్యాప్ పెట్టనున్నారు. అయితే పేరు మార్పు విషయంలోనే ఈసీ వద్ద చిక్కులు రావడంతో ఏం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP: జగన్ సభకు వెళ్లలేదని కుళాయి తొలగింపు.. వైసీపీ నేతలు తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారా?

YSRCP: వైసిపి నాయకులలో ఓడిపోతామనే భయం వారిని వెంటాడుతూ ఉంది. ఈ భయం కారణంగానే వైసిపి నాయకులు కార్యకర్తలు ఏం చేస్తున్నారనే విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయి వ్యవహరిస్తున్నారు. ఇటీవల కుప్పంలో ముఖ్యమంత్రి...
- Advertisement -
- Advertisement -