Karnataka: కుమార్తె లవ్ మ్యారేజ్.. కుటుంబం ఆత్మహత్య!

Karnataka: ప్రేమ వివాహాలు చేసుకుంటున్న జంటలు నేటి సమాజంలో నిత్యకృత్యం అయ్యాయి. అయితే, కుటుంబ సభ్యుల అంగీకారంతో జరిగే ప్రేమ వివాహాలు చాలా తక్కువగానే ఉంటాయని చెప్పొచ్చు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకొనే జంటలూ అనేకం. అయితే, అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె తమను కాదని వెళ్లిపోతే ఆ తల్లిదండ్రుల గుండె కోత వర్ణనాతీతం. అలాంటి తరుణంలో అఘాయిత్యానికి పూనుకుంటుంటారు. ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంది.

తమ కుమార్తె వేరే కులం వ్యక్తిని ప్రేమించి వెళ్లిపోయిందన్న నిజం తెలుసుకున్న ఆ కుటుంబం హతాశులయ్యారు. మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ యువతి ప్రేమ వ్యవహారం కన్నవారినే మింగేసింది. ఆమె సంతోషంగా ఉండడం పక్కనపెడితే గారాబంగా పెంచి పెద్ద చేసి, విద్యా బుద్ధులు నేర్పిన తల్లిదండ్రులు, అపురూపంగా చూసుకున్న సోదరుడు ఒకే సమయంలో మృత్యు ఒడికి చేరారు.

కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా హండిగనాళ గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీరామప్ప అనే వ్యక్తి తన భార్య సరోజ, కొడుకు మనోజ్, కూతురు అర్చనతో కలిసి నివాసముంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన డ్రైవర్ నారాయణ స్వామిని రామప్ప కూతురు ఇష్టపడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. డ్రైవర్ నారాయణస్వామి దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అర్చన వాళ్లది అగ్రకుల కుటుంబం.

ఇంట్లో తమ ప్రేమ పెళ్లికి ఒప్పుకోరని భావించిన అర్చన.. డ్రైవర్ నారాయణస్వామితో కలిసి సోమవారం ఇల్లు వదిలి వెళ్లిపోయింది. విషయం తెలిసిన రామప్ప కుటుంబం ఈ ఘటనను జీర్ణించుకోలేకపోయింది. కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. అల్లారుముద్దుగా ఏలోటూ లేకుండా పెంచుకున్న కుమార్తె తమ పరువు తీసిందని భావించిన వీరు.. సామూహికంగా చనిపోవాలని డిసైడ్ అయ్యారు. తమ మరణానికి అర్చన ప్రేమ వ్యవహారమే కారణమని సూసైడ్ నోట్ రాసి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -