Thummala Nageswara Rao: ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలోకి దిగనున్న తుమ్మల నాగేశ్వరరావు

Thummala Nageswara Rao: మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీలోకి దిగే ఆలోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచి భూపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పాలేరు టీఆర్ఎస్ టికెట్ ఎవరికి దక్కుతుందనేది హాట్‌టాపిక్‌గా మారింది.

 

 

పాలేరులో టీఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. తుమ్మల వర్గం, భూపేందర్ రెడ్డి వర్గాలు టీఆర్ఎస్ లో ఏర్పడ్డాయి. ఎవరికి వారు తమ నేతకే టికెట్ వస్తుందని ఆశిస్తోన్నారు. తుమ్మల తనకే టీఆర్ఎస్ టికెట్ దక్కుతుందని చెబుతుండగా.. భూపేందర్ రెడ్డి కూడా టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. అయితే పాలేరు నియోజకవర్గాన్ని వదిలిపెట్టే పరిస్ధితుల్లో తుమ్మల కనిపించడం లేదు.

 

పాలేరు నుంచి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలనే ఆలోచలో తుమ్మల ఉన్నారు. ఒకవేళ టీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా తుమ్మల పోటీ చేసే అవకాశాలు కనిపిస్తోన్నాయి. దీనిని బట్టి చూస్తే ఒకవేళ టీఆర్ఎస్ టికెట్ రాకపోతే రెబల్ అభ్యర్థిగా తుమ్మల పోటీ చేసే అవకాశముంది.గత ఎన్నికల్లో పాలేరులో ఓడిపోవడంతో.. ఎక్కడైనా ఓడిపోయారో అక్కడే గెలిచి చూించాలనే పట్టుదలతో తుమ్మల ఉన్నారు. అందుకే ఎట్టిపరిస్ధితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో పాలేరులో గెలిచేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతోన్నారు.

 

టీఆర్ఎస్ తో మాత్రం సంబంధాలు తెంచుకునేందుకు తుమ్మల ఇష్ట పడటం లేదు. వేరే పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నా.. ఇతర పార్టీల్లోకి ఆయన వెళ్లేందుకు మొగ్గు చూపడం లేదు. బీజేపీతో పాటు కాంగ్రెస్ ఆయనను ఆహ్వానిస్తోన్నారు.. తిరిగి టీడీపీలోకి రావాలని ఆ పార్టీ నేతలు కూడా పిలుస్తున్నారు. కానీ తుమ్మల వేరే పార్టీలలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -