Tummala Nageswara Rao: బీజేపీలోకి తుమ్మల నాగేశ్వరరావు? ముహూర్తం ఫిక్స్ అయిందా?

Tummala Nageswara Rao: మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారా.. త్వరలోనే కాషాయ కండువా కప్పకుంటారా.. సీఎం కేసీఆర్ కు అనూహ్యంగా హ్యాండ్ ఇవ్వనున్నారా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ లో గత కొంతకాలంగా తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తిగా ఉన్న ఉన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఆయన చక్రం తిప్పారు. సీఎం కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా మెలిగారు. కేసీఆర్ కూడా తుమ్మల నాగేశ్వరరావుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కానీ గత ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఆయనను కేసీఆర్ పట్టించుకోవడమే మానేశారు.

గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ ఎలాంటి నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. ఎమ్మెల్సీ పదవి లేదా నామినేటెడ్ పదవులు ఎలాంటివి ఇవ్వలేదు. ఓడిపోయిన చాలామంది నేతలకు కేసీఆర్ ఎమ్మెల్సీ లేదా పలు కీలక నామినేటెడ్ పదవులు ఇచ్చారు. కానీ తుమ్మల నాగేశ్వరరావుకు మాత్రం ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో టీఆర్ఎస్ లో తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తితో రలిగిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఆయనకు పోటీకి నియోజకవర్గంలో మరో నేతలకు టీఆర్ఎస్ ప్రాధాన్యతం ఇస్తోంది.

అంతేకాకుండా ఖమ్మం జిల్లాలో మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ తో తుమ్మల నాగేశ్వరరావుకు విబేధాలు ఉన్నాయి. జిల్లా మంత్రి తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తుమ్మల ఆరోపిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సీటు దక్కే అవకాశం లేకపోవడంతో తుమ్మల బీజేపీలో చేరే దిశగా అడుగులు వేస్తోన్నట్లు చెబుతున్నారు. 2014 తర్వాత తుమ్మల టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. ఉపఎన్నికలో గెలిచి కేసీఆర్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. 2018 ఎన్నికల్లో పాలేరులో కాంగ్రెస్ అభ్యర్ధి ఉపేందర్ రెడ్డిపై తుమ్మల ఓడిపోయారు.

ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరడంతో పాలేరు టికెట్ ఆయనకే కేటాయించే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో పాలేరు టీఆర్ఎస్ టికెట్ తనకేనంటూ ఇటీవల తుమ్మల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో పాలేరు నియోజకవర్గంలో వర్గ విబేధాలు నెలకొనడంతో కేటీఆర్ స్పందించినట్లు తెలుస్తోంది. ఉపేందర్ రెడ్డి వైపే కేటీఆర్ ఉండటంతో.. తనకు టికెట్ దక్కదని తుమ్మల ఓ నిర్ణయానికి వచ్చారు. దీంతో తుమ్మల బీజేపీలో చేరతారని అంటున్నారు. తెలంగాణలో తుమ్మల నాగేశ్వరరావుకు మంచి పేరు ఉంది. బలమైన కమ్మ సామాజికవర్గ నేతగా ఆయన ఉన్నారు. కమ్మ సామాజికవర్గానికి బలమైన ఫేస్ గా ఆయన ఉన్నారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావును చేర్చుకుంటే కమ్మ సామాజికవర్గాన్ని ఆకట్టుకోవచ్చనే ఆలోచనలో బీజేపీ ఉంది. ఇప్పటికే బీజేపీలో చేరాల్సిందిగా ఆయనను కాషాయ నేతలు ఆహ్వానించారు. కానీ ఆచితూచి నిర్ణయం తీసుుంానంటూ తుమ్మల బీజేపీ నేతలకు చెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. ఇటీవల పలవుురు నేతలను బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంటోంది. దీంతో ఎన్నికలకు సమయం దగ్గరప పడుతుండటంతో. తుమ్మల కూడా వీలైనంత త్వరగా బీజేపీలో చేరాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -