Ex CM Chandrababu Naidu: మరోసారి బాబును అవమానించేలా పోస్టర్లు!

Ex CM Chandrababu Naidu:  రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం మామూలే. ఒకప్పుడు ఒకరిపై ఒకరు రాజకీయ నాయకులు చేసుకునే ఆరోపణలు సాధారణ మాటల్లో చేసుకునేవారు. ఎదుటివారు చేసిన ఆరోపణల్లో అంతగా బాధ్య పెట్టే అంశం ఉండేది కాదు.. కానీ.. నేటి రాజయాల్లో కేవలం మాటలే కాదు.. చేతలతో కూడా ప్రత్యుర్థులకు కించపరుస్తూ దిగజారుతున్నారు. కేవలం అభ్యర్థులనే కాకుండా వారి కుటుంబ సభ్యులను సైతం ఇందులోకి దింపి వారి వారి కుటుంబాలను అవమానపరుస్తున్నారు. వయస్సు భేదం , మహిళలు అని కూడా చూడకుండా నోటికేదొస్తే అది మాట్లాడుతూ తమ దిగజారుడు రాజకీయాలను అవలంభిస్తున్నారు నేటి రాజకీయ నాయకులు. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని అవమానించేలా విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ లో రాత్రికిరాత్రే వెలిసిన వాల్‌ పోస్టర్లు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి.

గతంలో అసెంబ్లీలో సమావేశాల్లో తన భార్యను అవమానించారంటూ చంద్రబాబు కన్నీటిపర్యంతమైన ఫొటోతో పాటు‘నా పెళ్లాం పతివ్రత’ అంటూ అనుచిత కామెంట్స్‌ తో పోస్టర్లను గోడలపై అతికించారు. ఆ రెండు ఫొటోలతో పాటు చంద్రబాబు భార్య భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్‌ ఫొటోలతో పాటు ఎలిమినేటి మాధవరెడ్డి ఫొటో ఆ పోస్టర్‌పై ఉండటం ఆంధ్రరాజకీయాల్లో కలకలం రేపుతోంది. గోడలపై ఆ పోస్టర్లు ఎవరంటించారనే దానిపై పోలీసుల సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఏదీ ఏమైనా రాజకీయాల్లో అభ్యర్థులపై విమర్శలు చేయాలే కానీ.. ఇలా కుటుంబ సభ్యుల ఫొటోలు బహీర్గతం చేయడం కరెక్ట్‌ కాదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -