Diabetes: షుగర్ నియంత్రణలో ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇది తాగాల్సిందే?

Diabetes: మన వంటింట్లో దొరికే వాటిలో మెంతులు కూడా ఒకటి. భారతీయులు మెంతులను చాలా రకాల వంటకాలలో వినియోగిస్తూ ఉంటారు. మెంతుల లోని మూలకాలు వంటకానికి రుచిని పెంచుతాయి. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ వైరల్ గుణాలు ఇందులో లభిస్తాయి. వీటితోపాటుగా మెంతులు వల్ల ఇంకా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. మధుమేహం ఉన్నవారికి మెంతులు ఎంతో బాగా ఉపయోగపడతాయి.

మెంతులను తరచుగా తీసుకుంటూ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అయితే మధుమేహంతో బాధపడుతున్న వారు మెంతులను ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మధుమేహంతో బాధపడుతున్నవారు మెంతుల టీని తప్పకుండా తాగాల్సి ఉంటుంది. ఈ టీని తయారు చేసుకోవడానికి ఒక ఫ్యాన్ తీసుకుని అందులో కప్పు నీరు వేసి మరిగించాలి. అందులోనే ఒక చెంచా మెంతి గింజలను వేసి బాగా ఉడికించాల్సి ఉంటుంది. ఇలా 20 నిమిషాల పాటు మరిగించిన తర్వాత ఒక కప్పులో తీసుకుని అందులో తేనె కలుపుకుని ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

 

ఇలా ప్రతి రోజూ తాగడం వల్ల మధుమేహంతో బాధపడుతున్నవారికి రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఊబకాయం సమస్యల నుంచి కూడా ఉపమనం లభిస్తుంది. అలాగే మెంతి ఆకులను నీటిని వేసి ఉడికించి ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక కప్పు తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలగడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ తప్పకుండా ఈ మెంతి ఆకులతో తయారు చేసిన నీటిని తాగాల్సి ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: చంద్రబాబు దూకుడు మామూలుగా లేదుగా.. రోజుకు మూడు సభలతో అలా ప్లాన్ చేశారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న పలమనేరులో ప్రజా గళం పేరిట ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -