Vastu Tips: లక్ష్మీదేవి ఇంట్లో నివసించాలంటే ఈ వస్తువులు ఉండాల్సిందే?

Vastu Tips: చైనీస్ వాస్తు శాస్త్రం ఫెంగ్ షుయ్‌ ప్రకారం ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే కొన్ని రకాల వస్తువులను ఇంట్లో పెట్టాల్సిందే. చైనీస్ వారు వారి ఇళ్లలో తప్పనిసరిగా ఈ రకాల వస్తువులను ఉంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ వస్తువులను పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మనీ ఫ్రాగ్.. మూడు కాళ్ల టోడ్ లేదా ఫెంగ్ షుయ్ మనీ ఫ్రాగ్ అదృష్టాన్ని తెస్తుంది. దీన్ని ఇంటి ప్రధాన ముఖ ద్వారం వద్ద పెట్టుకోవాలి. డబ్బులు దాచే చోట కూడా పెట్టొచ్చు.

వంటగది, వాష్ రూమ్స్ లో అస్సలు ఉంచకూడదు. ఇలాంటి ప్లేస్ లో పెడితే జీవితంలో సమస్యలు మరింత పెరుగుతాయి. ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కప్పలు ఉంచాలనుకుంటే వాటి సంఖ్య 3, 6 లేదా 9 ఉండేలా చూసుకోవాలి. లాఫింగ్ బుద్ధ..
చైనా వినాయకుడుగా పిలిచే లాఫింగ్ బుద్ధను కూడా ఇంటి ఎంట్రన్స్ లోనే ఉంచాలి. లాఫింగ్ బుద్ధ ముఖంలో ఉంటే పెద్ద చిరునవ్వు నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టి శుభాన్ని ఆహ్వానిస్తుంది.లాఫింగ్ బుద్ద ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం, ఆనందం రెండూ ఉంటాయి. ఇంట్లో, కార్యాలయంలో, వ్యాపార సంస్థల్లో ఎక్కడైనా లాఫింగ్ బుద్ధని పెడితే అంతా శుభమే అని విశ్వసిస్తారు. అయితే ఈ బొమ్మను ఎవరికి వారు కొనుక్కోకూడదు. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చింది తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది.

 

గోల్డెన్ ఫిష్.. ఫెంగ్ షుయ్ శాస్త్రం ప్రకారం ఇంట్లో గోల్డెన్ ఫిష్ ఉంటే అది ఆనందానికి, సమరస్యానికి ప్రతీకగా నమ్ముతారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం లో అద్భుతంగా అభివృద్ధి చెందుతారు. ఈ చేపను డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకోవాలి. దీన్ని ఇంట్లో పెట్టుకున్న రోజునుంచీ మీ సక్సెస్ ని మీరే గమనిస్తారు. మూడు చైనీస్ నాణేలు.. చైనీస్ నాణేలు సంపదకు మూలంగా పరిగణిస్తారు. వృత్తాకార నాణేలు దాని రెండు వైపులాయిన్ , యాంగ్‌లను సూచిస్తాయి. యాంగ్ నాలుగు వైపులా నాలుగు అక్షరాలు చెక్కి ఉంటాయి. యిన్‌లో రెండు అక్షరాలు ఉండొచ్చు లేదంటే ఖాళీగా కూడా ఉండొచ్చు. నాణేల గుండ్రటి ఆకారం స్వర్గాన్ని, చతురస్రాకారపు ఆకారం భూమిని సూచిస్తుంది. సాధారణంగా మూడు, ఆరు లేదా తొమ్మిది ఫెంగ్ షుయ్ నాణేల బంచ్‌లు ఎరుపు లేదా పసుపు రంగు రిబ్బన్‌తో ముడేసి పెడతారు. ఫెంగ్ షుయ్ లో ఎరుపు శుభప్రదమైన రంగు, ప్రాణశక్తికి సూచన. ఎరుపు రిబ్బన్‌తో ముడేసిన చైనీస్ నాణేలను ఇంటి ప్రధాన ద్వారం వెనుక ఉంచాలి. అలాగే చైనీస్ తాబేలు.. ఫెంగ్ షుయ్ వాస్తు శాస్త్రం ఈ రెండూ కూడా తాబేలును అదృష్టానికి కేరాఫ్ గా పరిగణిస్తాయి. తాబేలు బొమ్మను ఉత్తర దిశలో ఉంచడం వల్ల జీవితంలో వైఫల్యం అనే మాటే వినిపించదంటారు వాస్తు నిపుణులు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -