The Temple: ఆ దేవాలయాలను దర్శించుకోవాలంటే సాహాసం చేయాల్సిందే!

The Temple: దేవ భూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ మాత్రమే కాదు. దర్శించుకోవడానికి కష్టతరమైన ఆలయాలు మరికొన్ని ఉన్నాయి. అక్కడ కొలువై ఉన్న భగవంతుడి దర్శనం అంత సులభతరమేమీ కాదు. ఆ దేవుళ్ల దర్శనభాగ్యం దొరకాలంటే.. భక్తి ఒక్కటి మాత్రమే ఉంటే సరిపోదు. కష్టపడే శక్తి కూడా ఉండాలి. అనేక సహజ, వాతావరణ అడ్డంకులను దాటుకొని వెళ్లే సంకల్ప బలాన్ని కలిగి ఉండాలి.

శంకరుడు కొలువైన పవిత్ర స్థలం..

ఒక భక్తుడు గనక.. తాను నమ్మిన దైవాన్ని దర్శించుకొని తీరాలని నిర్ణయించుకుంటే.. అతన్ని ఏదీ ఆపలేదు. అయితే.. దేవభూమి ఉత్తరాఖండ్‌లో కొలువై ఉన్న కొన్ని ఆలయాలను దర్శించుకోవడం అంత సులువు కాదు. ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయ్‌. మరెన్నో ఇబ్బందులు వెంటాడుతాయ్‌. వీటన్నింటిని అధిగమించేందుకు.. తీవ్రమైన సంకల్ప శక్తి అవసరమవుతుంది. అప్పుడే.. భక్తులు తాము నమ్మిన దైవాన్ని కనులారా దర్శించుకునేందుకు వీలవుతుంది. అలాంటి దర్శనీయ స్థలాల లిస్టులో.. కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ మాత్రమే కాదు.. మరికొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. ఇందులో.. కైలాస మానస సరోవర్‌ ఒకటి. ఇది.. నిజంగా అత్యంత సవాల్‌తో కూడుకున్న ప్రదేశం. దీనిని చేరుకోవడం ఎంతో కష్టమైన వ్యవహారం. ప్రస్తుతం.. ఇది చైనా ఆక్రమిత టిబెట్‌లో కొలువై ఉంది. ఈ ప్రదేశంలో కైలాస పర్వతంతో పాటు మానస సరోవర్‌ సరస్సు.. ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయ్‌. ఇక్కడ.. ఆ శివుడే కొలువై ఉంటాడని భక్తులు నమ్ముతుంటారు.

రెండు వందల ఏళ్ల చరిత్ర గల ఆలయం..

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో.. కార్తీక స్వామి ఆలయం కొలువై ఉంది. 2 వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న ఈ పురాతన కోవెల ఇది. ఉత్తరాఖండ్‌ మొత్తంలో.. కొలువై ఉన్న ఏకైక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇది. 3050 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే.. సాహసం చేయాల్సిందే. ఇక్కడికి చేరుకునేందుకు.. భక్తులు కనకచౌరి గ్రామం నుంచి 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ చేయాల్సి ఉంటుంది.

యమునోత్రి ఆలయం..

ఉత్తరాఖండ్‌ చోటా చార్‌ధామ్‌ యాత్రకు సంబంధించిన నాలుగు ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో.. యుమునోత్రి ఆలయం ఒకటి. ఈ సుందరమైన ఆలయం.. ఉత్తరకాశీ జిల్లాలో కొలువై ఉంది. ఈ టెంపుల్‌.. 3 వేల 293 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే.. బలమైన మానసిక, శారీరక బలం అవసరం.

పర్వత క్షేత్రం తుంగనాథ్‌ ఆలయం..

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌ జిల్లాలో ఉన్న మరో పర్వత క్షేత్రం తుంగనాథ్‌ ఆలయం. ఈ క్షేత్రానికి ఓ విశేషం ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ఈ తుంగనాథ్‌ క్షేత్రం. ఇది.. హిమాలయాల్లో.. 3 వేల 680 మీటర్ల ఎత్తులో కొలువై ఉంది. సుమారు వెయ్యేళ్ల క్రితం.. ఈ దివ్య ఆలయాన్ని నిర్మించి ఉంటారని భక్తులు నమ్ముతారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -