Toilet: ఇండియన్ టాయిలెట్ మంచిదా? వెస్ట్రన్ టాయిలెట్ మంచిదా?

Toilet: పాతకాలంలో అయితే మల, మూత్ర విసర్జనకు బయటకు వెళ్లే వాళ్లు. కానీ ఇప్పుడు కాలం మారి అందరూ టాయిలెట్లను బాగా వినియోగిస్తున్నారు. అయితే టాయిలెట్లలో కూడా ఇప్పుడు ఇండియన్ బెస్టా లేదంటే వెస్ట్రన్ బెస్టా అనే చర్చ నడుస్తోంది. ఇండియన్ టాయిలెట్ అంటే కొంతమందికి ఇబ్బందిగా అనిపిస్తే, వెస్ట్రన్ టాయిలెట్ చాలామందికి సౌకర్యవంతంగా అనిపిస్తుంటుంది.

సౌకర్యం సంగతి పక్కన బెడితే ఆరోగ్య ప్రయోజనాల దృశ్యా ఇండియన్ టాయిలెట్ బెస్టా? లేదంటే వెస్ట్రన్ టాయిలెట్ బెస్టా? అనే చర్చ నడుస్తూ ఉంటుంది. అయితే ఇండియన్ టాయిలెట్ ని వాడాలంటే మనం మన మోకాళ్లను మడిచి కూర్చుకుంటాం. దీని వల్ల తొడ కండరాలు మరియు పాదాల బిగువు వల్ల శరీరంలో పటుత్వం వస్తుంది. కడుపులో జీర్ణాశయపు ఇరువైపు కండరాలు సంకోచ వ్యాకోచాలు జరుగుతాయి. ఫలితంగా పేగుల్లో మిగిలిన వ్యర్థ పదార్థం బయటకు పోతుంది.

అదే వెస్ట్రన్ టాయిలెట్ వాడితే ఇలా ఉండదు. మామూలుగా మనం కుర్చీలో ఎలాగైతే రిలాక్స్ గా కూర్చోగలమో అలా వెస్ట్రన్ టాయిలెట్ సెటప్ ఉంటుంది. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనం చేకూరదు. మామూలుగా మన శరీరంలో ఉన్న మలం ఇండియన్ టాయిలెట్ వాడితే 3 నుండి 3.5 నిమిషాల్లో బయటకు పోతుంది. అదే వెస్ట్రన్ టాయిలెట్ ని వాడితే 5-7 నిమిషాల సమయం పడుతుంది.

వెస్ట్రన్ టాయిలెట్ వాడే వారిలో ఎక్కువగా ఇన్ ఫెక్షన్లు, ప్రేగు లాంటి వ్యాధులు వస్తుంటాయి. అదే ఇండియన్ టాయిలెట్ వాడే వారిలో ఇలాంటి సమస్యలు రావు. పైగా గర్భవతులు ఇండియన్ టాయిలెట్లను వాడాలని వైద్యులు సలహా ఇస్తుంటారు. ఇండియన్ టాయిలెట్ వాడటం వల్ల గర్భవతులకు నార్మల్ డెలివరీ అవుతుందని వారు చెబుతుంటారు. అన్ని ఆరోగ్య ప్రయోజనాల నేపథ్యంలో వెస్ట్రన్ టాయిలెట్ కన్నా ఇండియన్ టాయిలెట్ వాడటం ఉత్తమం.

Related Articles

ట్రేండింగ్

Janasena Complaint on YS Jagan: ఏపీ ఎన్నికల సంఘం దృష్టికి పవన్ పెళ్లిళ్ల గోల.. జగన్ కు భారీ షాక్ తప్పదా?

Janasena Complaint on YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన ఏ సభకు వెళ్లిన అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్...
- Advertisement -
- Advertisement -