Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రేటీలు తమ జీవిత భాగస్వామి విషయం లో నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్లు కొంతకాలం దాంపత్య జీవితం బాగానే గడిపినప్పటికీ తర్వాత ఈ దంపతులకు కొన్ని కొన్ని మనస్పర్ధలు వస్తాయి. దీని కారణంగా ఆ జంటకు ఒక బిడ్డ పుట్టినప్పటికీ విడాకులు తీసుకొని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ఆ కోవకు చెందిన సెలబ్రేటీల వివరాలు మనం తెలుసుకుందాం.
రాధిక శరత్ కుమార్ : రాధిక గురించి మనందరికీ తెలిసిందే. అప్పటి కాలంలో స్టార్ హీరోయిన్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. ఇక రాధిక మొదట 1995 లో ప్రతాప్ పోతన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కాగా ఈ జంట సంవత్సరంలోపే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రాధిక 2001లో శరత్ కుమార్ ని పెళ్లి చేసుకుంది. వీరికి రోహిత్ అనే అబ్బాయి కూడా పుట్టాడు. ఇక రాధికకు మొదట భర్త తో ఒక అబ్బాయి పుట్టాడట. ఇక వరలక్ష్మి నటుడు శరత్ కుమార్ మొదటి భార్యకు పుట్టిన అమ్మాయి.
సౌందర్య : సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య గురించి మనందరికీ తెలిసిందే. తను డైరెక్టర్ గా రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది. సౌందర్యకు రెండు వివాహాలు జరిగాయి. మొదట అశ్విన్ రామ్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి వీరిద్దరికి విడాకులు జరిగాయి. వీరిద్దరి దంపతులకు వేద్ అబ్బాయి కూడా పుట్టాడు. ఇక సౌందర్య రెండవ వివాహం విశాగన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి కూడా ఒక అబ్బాయి పుట్టాడు.
శ్రీజ : మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ గురించి మనందరికీ తెలిసిందే. శ్రీజ చదువుకునే రోజుల్లో తన క్లాస్ మేట్ సిరీస్ భరద్వాజ్ ను రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి వీరిద్దరూ విడిపోయారు. వీరికి నివ్రితి అనే అమ్మాయి కూడా పుట్టింది. ఇక మొదటి భర్తతో విడాకులైన తర్వాత శ్రీజ కళ్యాణ్ దేవ్ ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరి దంపతులకు 2018 లో నవిష్క అనే అమ్మాయి పుట్టింది.