గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమెడియన్.. గొప్పవాడు కాదంటూ?

తెలుగు రాష్ట్రాల ప్రజలకు కమెడియన్ రాహుల్ రామకృష్ణ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అర్జున్ రెడ్డి తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రాహుల్.. ఆ సినిమాలో హీరో స్నేహితుడిగా నటించాడు. అంతేకాకుండా పెళ్లి చూపులు సినిమాలో రెండు పాటలు కూడా రాశాడు రాహుల్. ఆ తర్వాత హుషారు, భరత్ అనే నేను, వంటి పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను తన కామెడీతో ఆకట్టుకున్నాడు రాహుల్.

తెలుగు నాట కమెడియన్ గా, నటుడుగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. ప్రస్తుతం చేతినిండా వరుస ఆఫర్లతో షూటింగ్ నేపథ్యంలో రాహుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రాహుల్ సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తన మూవీ అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటాడు. ఇక సోషల్ మీడియాలో తనకు సంబంధం లేని విషయాల్లో తల దూర్చి హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటాడు రాహుల్.

మరి ఇదే క్రమంలో తాజాగా రాహుల్ గాంధీ జయంతి కావడం గాంధీ పై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గాంధీని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశాడు. గాంధీ గొప్పవాడని నేను అనుకోను.. అని రాసుకొచ్చాడు. అక్టోబర్ 2న మందు దొరకదు కాబట్టి గాంధీని ఉద్దేశించి రాహుల్ ఈ ట్వీట్ చేశాడని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం రాహుల్.. గాంధీ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక రాహుల్ వ్యక్తిగత విషయానికి వస్తే ఇతడు తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్లో పుట్టాడు. ఇతడి తండ్రి యోగా అధ్యాపకుడు.. తల్లి ఓ వ్యాపార పత్రికలో సహాయ సంపాదకురాలు. రాహుల్ హైదరాబాదు విజేఐటి కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ రెండు సంవత్సరాలు చదివి ఆపేసాడు. ఆ తర్వాత రాహుల్ కు సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో సినీ రంగంలో అడుగు పెట్టడానికి ప్రయత్నాలు చేశాడు. ప్రస్తుతం తాను నటుడుగా తెలుగు ఇండస్ట్రీలో గుర్తిపు తెచ్చుకున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -