Tollywood: ఈ సెలబ్రిటీలు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని మీకు తెలుసా?

Tollywood: సినీ ఇండస్ట్రీలో విచిత్రాలకు కొదవేమీ లేదు. ఒక్కొక్కరూ ఒక్కొక్క రకమైన అంశంలో ఎప్పుడూ రికార్డు సృష్టిస్తూనే ఉంటారు. ఇదే క్రమంలో ఏకంగా ఒకటి రెండు కాదు మూడు , అంతకంటే పైనే పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ మన ఇండస్ట్రీలో ఉన్నారు. నమ్మడానికి ఇబ్బందిగా ఉన్న ఇది వాస్తవం. మరి వాళ్ల గురించి తెలుసుకుందాం..

 

సంజయ్ దత్

బాలీవుడ్ లో లెజెండ్ యాక్టర్స్ అయిన సునీల్ దత్ మరియు నర్గీస్ దత్ ల వారసుడిగా సంజయ్ దత్ బాలీవుడ్ సినీ రంగ ప్రవేశం చేశాడు. సంజయ్ తన మొదటి చిత్రం రాఖీ తోటే బాలీవుడ్ లో సంచలనాన్ని సృష్టించాడు. సంజయ్ దత్ ఇప్పటికీ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. సంజయ్ దత్ మొదట రీచా శర్మాను వివాహం చేసుకున్నాడు. 1998 లో రీచా మరణం తర్వాత సంజయ్ రియా పిళ్ళై ను పెళ్లి చేసుకొని తిరిగి 2008లో డైవర్స్ తీసుకున్నారు. తర్వాత సంజయ్ మాన్యతను వివాహం చేసుకున్నారు.

 

కమల్ హాసన్

తెలుగు మరియు తమిళ్ రెండు సినీ ఇండస్ట్రీలలో లెజెండ్రీ ఆక్టర్ గా పేరు పొందిన కమల్ హాసన్ కూడా ఇప్పటికీ మూడు వివాహాలు చేసుకున్నారు. కమల్ హాసన్ మొదటి వివాహం వాణీ గణపతి తో జరిగింది. తర్వాత కమల్ హాసన్, సారిక ను పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో సారిక మరియు కమల్ హాసన్ ప్రేమాయణం పెద్ద వివాదానికే దారితీసింది. కానీ అది కూడా ఎక్కువ రోజులు సాగకముందే సారికకు డైవర్స్ ఇచ్చిన కమల్ తిరిగి గౌతమితో ఏడడుగులు నడిచారు.

 

పవన్ కళ్యాణ్

టాలీవుడ్ లో అత్యంత పాపిలారిటీ ఉన్న నటుడిగా పవన్ కళ్యాణ్ కు మంచి గుర్తింపు ఉంది. పవన్ కళ్యాణ్ కూడా మూడుసార్లు పెళ్లి పీటలు ఎక్కాడు. మొదట ఆయన నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. తర్వాత బద్రి చిత్రం షూటింగ్ అప్పుడు రేణు దేశాయ్ ప్రేమలో పడ్డ పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల సహజీవనం తర్వాత రేణు దేశాయ్ వివాహం చేసుకున్నారు. తర్వాత రేణుకు డైవర్స్ ఇచ్చిన పవన్ అన్నా లెజ్నెవా ను వివాహమాడారు.

 

రాధిక

ఇటు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా అటు బుల్లితెరపై కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి రాధిక. ఆమె కూడా ఇప్పటికీ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రతాప్ పోతినేని తో 1985 లో ఆమె వివాహం జరిగింది. కానీ ఇద్దరికీ పొంతన కుదరకపోవడంతో అతనికి డైవర్స్ ఇచ్చిన రాధిక తరువాత రిచర్డ్ హార్డీ అనే బ్రిటిష్ అన్న పెళ్లి చేసుకొని లండన్ లో సెటిల్ అయింది. అతని ప్రవర్తన బాగా లేకపోవడంతో రాధిక అతనికి కూడా డైవర్స్ ఇవ్వవలసి వచ్చింది. తర్వాత శరత్ కుమార్ ని పెళ్లి చేసుకున్న రాధిక ప్రస్తుతం ఆనందంగా వివాహ బంధంలో సెటిల్ అయిపోయింది.

 

అమీర్ ఖాన్

బాలీవుడ్ స్టార్ యాక్ట్ అయిన అమీర్ ఖాన్ కూడా ఇప్పటికీ మూడుసార్లు నిక్కా పక్క చేసుకున్నాడు. ఆయన మొదట రీనా దత్తా ను వివాహం చేసుకున్నారు. తర్వాత కొంతకాలానికి ఆమెకు డైవర్స్ ఇచ్చి కిరణ్ రావు తో సెటిల్ కానీ ఆ తర్వాత కిరణ్ రావు ని కూడా పక్కనపెట్టి ప్రస్తుతం ఫాతిమా సనా షేక్ ను పెళ్లి చేసుకుఎన్నడూ.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -