Tollywood: ఆర్మాక్స్ సర్వేలో నంబర్1 స్టార్ ఎవరో తెలుసా?

Tollywood: సినిమా ఇండస్ట్రీ అంటేనే నంబర్ గేమ్. ఒక్క శుక్రవారం హీరోల తలరాతలను మార్చేస్తుంది. ఇంటర్నెట్ ప్రపంచంలో ఇటీవల కాలంలో స్టార్ హీరోల క్రేజ్ మార్కెట్ పై కూడా ప్రభావం గట్టిగానే చూపిస్తోంది. అందుకే నిత్యం ఏదో ఒక సంస్థ.. హీరోల స్టార్‌డమ్‌పై సర్వేలు చేస్తూ ఉంటుంది. శాటిలైట్ డిజిటల్ సోషల్ మీడియా ఆధారంగా బాగా క్రేజ్ అందుకున్న స్టార్లపై సర్వేలు నిర్వహించే ఓరామాక్స్ అక్టోబర్ నెల సర్వే లిస్ట్ కూడా విడుదల చేసింది. అందులో మన టాలీవుడ్ టాప్ 10 స్టార్ హీరోల లిస్ట్ పై ఒక లుక్కేస్తే…

 

 

ఒకటి, రెండు స్థానాల్లో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్
ఇటీవల కాలంలో సినిమాలు రిలీజ్ కానప్పటికీ ఆది పురుష్ టీజర్, సలార్ అప్‌డేట్స్ కారణంగా నంబర్ వన్ స్థానంలో ప్రభాస్ నిలిచాడు. ఓరామాక్స్ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్‌లో కొంత కాలం కిందట ఐదోస్థానంలో ఉన్న అతను ఇప్పుడు అగ్రస్థానానికి చేరాడు. ఆదిపురుష్ కారణంగా అతని మీద ట్రోలింగ్ వచ్చినప్పటికీ అవేమీ ప్రభావం చూపలేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ ప్రాజెక్టుతో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచి 2వ స్థానంలో నిలిచాడు.

 

అల్లు అర్జున్ 3, మహేష్ బాబు 4, రామ్ చరణ్ 5
రెండు మూడు నెలల నుంచి టాప్ లిస్టులోనే కొనసాగుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈసారి మూడో స్థానానికి పడిపోయాడు. ఎక్కువగా పుష్ప సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తోనే అల్లు అర్జున్ పేరు మీడియాలో హాట్ ఆఫ్ మారింది. ఇటీవల పుష్ప 2 అప్‌డేట్స్ పెద్దగా రాకపోవడంతో అతని స్థానంపై ప్రభావం పడింది. ఇక మహేష్ బాబు తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే దర్శక ధీరుడు రాజమౌళితో రూ.500 కోట్లతో చేస్తున్న ప్రాజెక్ట్ వల్ల అతని పేరు బాగా వినపడుతోంది. మహేష్ బాబు పేరును 4వ స్థానంలో వైరల్ అయ్యేలా చేశాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మోస్ట్ పాపులర్ సర్వేలో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. గత కొంతకాలంగా డైరెక్టర్ శంకర్‌తో సినిమాకు సంబంధించిన స్టిల్స్ వైరలవుతున్నాయి.

చివరి ఐదు స్థానాల్లో వీరే..
అటు రాజకీయాలు, ఇటు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు పవన్ కల్యాణ్. దీంతో నిత్యం సోషల్ మీడియాలో అతని పేరు వినిపిస్తూనే ఉంది. ఈ కారణంగా అతను ఆరో స్థానంలో నిలిచాడు. మాస్ మూవీ ‘దసరా’అప్‌డేట్స్‌తో నేచురల్ స్టార్ నాని కూడా హడావుడి చేశాడు. దీంతో సర్వేలో ఏడో స్థానం సాధించాడు. ఇక లైగర్ సినిమా పరాజయం తర్వాత విజయ్‌దేవరకొండ హవా కాస్త తగ్గింది. ఖుషి సినిమాకు సంబంధించిన బిజినెస్ వార్తలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. దీంతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

 

ఇటీవల సీనియర్ హీరోలు కూడా యువ హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా సోషల్ మీడియాలో హడావిడిగానే కనిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య మూవీల వల్ల ట్రెండింగ్ లిస్టులో చేరారు. ఓరామాక్స్ సర్వేలో ఆయన తొమ్మిదవ స్థానంలో నిలిచారు. అలాగే ఓ మై గాడ్ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించిన వెంకటేశ్ కొంత సోషల్ మీడియాని ఎట్రాక్ట్ చేశాడు. దీంతో ఇప్పుడు మోస్ట్ పాపులర్ సర్వేలో 10వ స్థానంలో నిలిచాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -