Tollywood: సైడ్ యాక్టర్లుగా ఎంట్రీ.. స్టార్స్ గా కంటిన్యూ!

Tollywood: తెలుగు, తమిళ్ సినీ ఇండస్ట్రీలలో ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్లు గా కొనసాగుతున్న కొంత మంది నటులు ఇలా సైడ్ పాత్రల ద్వారానే పైకి వచ్చారు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. విజయ్ దేవరకొండ
రౌడీ స్టార్ గా యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే విజయ్ మొదట్లో సినిమా అవకాశాలు లేక సైడ్ పత్రాలు చేసాడు. నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

2.సాయి పల్లవి
క్యూట్ గర్ల్, యూత్ క్రష్ సాయి పల్లవి మొదట్లో సైడ్ పాత్రలు చేసింది. ఓ ఛానల్ లో నిర్వహించిన డాన్స్ ప్రోగ్రాం ద్వారా కూడా మంచి పేరు కొట్టేసింది. విశాల్, మీరా జాస్మిన్ నటించిన పందెం కోడి చిత్రంలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది ఈ సొట్ట బుగ్గల సుందరి.

 

3.రవితేజ
మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరో స్టేట్స్ అనుభవిస్తున్న రవితేజ మొదట్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ వేసేవాడు. అనంతరం విలన్, సెకండ్ హీరో పాత్రలు కూడా చేసాడు. ఆలా రాజశేఖర్ అల్లరి ప్రియుడు చిత్రంలో సైడ్ పాత్రలో నటించాడు.

 

4. త్రిష
బ్లాక్ బ్యూటీ త్రిష కూడా తొలి రోజుల్లో సైడ్ పాత్రలు చేసింది. సూపర్ హిట్ మూవీ జీన్స్ లో హీరోయిన్ సిమ్రాన్ స్నేహితురాలుగా నటించింది. అనంతరం హీరోయిన్ గా నటిస్తూ స్టార్ అయింది.

 

5. విజయ్ సేతుపతి
వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ వైపు హీరోగా నటిస్తూనే, మరో వైపు ముఖ్యమైన పాత్రలు చేస్తూ రాణిస్తున్నాడు. విజయ్ కూడా తొలుత ధనుష్ హీరోగా నటించిన ధూల్ పేట చిత్రంలో సైడ్ పాత్రలో నటించాడు.

 

6.అనసూయ
జబర్దస్త్ షో ద్వారా హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. తన గ్లామర్ షో తో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుని పేరు గడించింది. ఈ ముద్దుగుమ్మ కూడా మొదట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాగ మూవీలో సైడ్ క్యారెక్టర్ చేసింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -