Tollywood: పవన్ పవర్‌ఫుల్ టైటిల్‌ను తారక్ సినిమాకు ఫిక్స్ చేశారా?

Tollywood: నటుడిగా, నిర్మాతగా మంచి పాపులారిటీ దక్కించుకున్నారు బండ్లగణేష్. మొదట్లో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు సహాయ నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసుకున్నాడు. 2018లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ పార్టీ టికెట్ దక్కలేదు. ఆ తర్వాత 2021 మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనుకున్నాడు. కానీ అందులో నుంచి కూడా తప్పుకున్నాడు. ప్రస్తుతం సినిమాలు చేస్తూ.. సక్సెస్‌ఫుల్ నిర్మాతగా రాణిస్తున్నాడు.

 

అయితే ప్రస్తుతం బండ్ల గణేష్‌కు టైటిల్ వివాదం నెలకొంది. గతంలో బండ్ల గణేష్ ఓ టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్నాడు. అదే ‘దేవర’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను బండ్ల గణేష్ పిలుచుకునే పేరది. అందుకే ఆ పేరును నిర్మాత బండ్ల గణేష్ ముందుగానే రిజిస్టర్ చేసుకుని పెట్టుకున్నాడు. అయితే ఆ టైటిల్ రెన్యూవల్ చేయించడం మరిచాడు బండ్ల గణేష్. ఈ టైటిల్‌ను దర్శకుడు కొరటాల శివ తీసేసుకున్నట్లు సమాచారం. కొరటాల శివ టైటిల్‌ను రిజిస్టర్ చేసుకుని తన దగ్గర పెట్టుకున్నాడట.

‘దేవర’ టైటిల్‌లో దర్శకుడు కొరటాల శివ.. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కానీ మరికొందరు టైటిల్ బాగుందని తీసుకున్నట్లు ఉందని చెబుతున్నారు. ‘దేవర’ టైటిల్‌ను కొరటాల శివ రిజిస్టర్ చేసుకోవడంతో నిర్మాత బండ్ల గణేష్ ఆయనకు స్వయంగా కాల్ చేసి అడిగినట్లు తెలుస్తోంది. తను అందరి కన్నా ముందుగా కొరటాలకు అడ్వాన్స్ ఇచ్చానని, సినిమా చేయకపోయినా ఆ మాత్రం గౌరవం లేదా? అని నిలదీశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కోసం కేటాయించిన ‘దేవర’ టైటిల్‌ను డైరెక్టర్ కొరటాల శివ దక్కించుకున్నాడు. మరి ఆ టైటిల్‌ను కొరటాల శివ.. ఎన్టీఆర్ కోసం వాడుతారా? లేదా తిరిగి నిర్మాత బండ్ల గణేష్‌కు ఇచ్చేస్తారా? వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -