Tollywood: ఆ మూవీ రీరిలీజ్ వల్ల తారక్ నష్టపోయారా?

Tollywood: ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్‌ తదితర స్టార్ హీరోల పుట్టిన రోజులకు గతంలో వారు నటించిన హిట్ సినిమాలను రీరిలీజ్ చేసేవారు. అప్పుడు కూడా మంచి కలెక్షన్లు రాబట్టి.. సక్సెస్ అందుకున్నారు. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్- దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘బాద్ షా’. ఈ సినిమాలో బండ్ల గణేశ్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమాను ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ చేశారు. ఊహించని విధంగా సినిమా థియేటర్లలో ఆడలేకపోయింది. దీంతో నెట్టింట ట్రోల్ ఊపందుకున్నాయి.

సాధారణంగా అభిమానులు తమ హీరోలపై ప్రేమ, అభిమానాన్ని విభిన్న రీతిలో చూపించుకుంటారు. ఈ క్రమంలో కొందరు అత్యుత్సాహం చూపుతూ.. హీరోల పరువు తీస్తుంటారు. ఇప్పటికే అభిమానులు ప్రభాస్ పరువు తీసిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్‌కు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఎన్టీఆర్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బాద్ షా’. 2013 ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం.. ఇప్పుడు తాజాగా రీ రిలీజ్ చేశారు. ఎలాంటి వెకేషన్ లేకుండానే సినిమాను రీరిలీజ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘రెబల్, బిల్లా’ చిత్రాలను రీరిలీజ్ చేశారు. కలెక్షన్లు కూడా బాగానే రాబట్టగలిగారు.

కానీ తాజాగా ప్రభాస్-త్రిష కలిసి నటించిన ‘వర్షం’ సినిమాను ఎలాంటి రీజన్ లేకుండా రీరిలీజ్ చేశారు. కలెక్షన్ల విషయంలో వెనుకబడటంతో ప్రభాస్ పరువు మొత్తం తీసినట్లయింది. ఇప్పుడు అదే దారిలో ఎన్టీఆర్ అభిమానులు అడుగులు వేస్తున్నారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘బాద్ షా’ సినిమాను గ్రాండ్‌గా రీరిలీజ్ చేశారు. కానీ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అస్సలు బాగాలేదు. బుకింగ్స్ కూడా ఎంతో పూర్‌గా ఉన్నాయని సమాచారం. అనవసరంగా సినిమాను రీరిలీజ్ చేసి ఎన్టీఆర్ పరువు తీస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం చాలా సంతోషంలో ఉన్నారు. అయితే బాద్ షాకు బదులు ‘ఆది, సింహాద్రి’ వంటి మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు రీ రిలీజ్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని చెప్పుకొస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -