Tollywood: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు మంచి క్రేజ్ దక్కింది. అప్పటివరకు టాలీవుడ్ స్టార్‌గా ఉన్న ఈ హీరోలు.. ఈ సినిమాతో పాన్ ఇండియానే కాదు.. పాన్ వరల్డ్ హీరోలుగా ఎదిగిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఆస్కార్ బరిలో కూడా నిలుస్తుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతటి క్రేజ్, హిట్‌ను ‘ఆర్ఆర్ఆర్’ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడు అనేది అర్థమవుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ స్టోరీ సెలక్షన్ విషయంలో ఎంతో ఆచితూచీ అడుగులు వేస్తున్నారు. స్టోరీ నార్మల్‌గా ఉన్నా.. వెంటనే క్యాన్సల్ చేయడం, లేదా స్టోరీ మార్పులు చేసేలా డైరెక్టర్లకు సలహాలు కూడా ఇస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్.. నటనకు ఎన్ని మార్కులు వేసినా తక్కువే అని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్టీఆర్‌తో కలిసి ఓ సినిమాలో నటించిన హీరోయిన్.. ఆయనను చూసి అప్పట్లోనే గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతాడని చెప్పింది. ఆ మాటలు తిరిగి ఇప్పుడు రిపీట్ చేయడంతో సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఊసరవెల్లి’. ఈ సినిమాలో ఎన్టీఆర్-తమన్నా హీరోహీరోయిన్‌గా నటించారు. ఇందులో తమన్నా స్నేహితురాలి పాత్రలో పాయల్ ఘోష్ అలరించింది. నిజానికి పాయల్ ఘోష్.. ఎన్టీఆర్‌కు బిగ్ ఫ్యాన్. ఎన్టీఆర్ యాక్టింగ్, డ్యాన్సింగ్ అంటే ఆమె చాలా ఇష్టం. అందుకే ఆమెకు ఎన్టీఆర్ అంటే అంత ఇష్టం. అయితే ఆమె ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ కాకముందు 2020లో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడని చెప్పుకొచ్చింది. ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు నిజం అయ్యాయి.
ఈ విషయాన్ని పాయల్ ఘోష్ గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతాడని నాకు ముందే తెలుసు. అప్పుడు నా మాటలకు అందరూ నవ్వారు. కొందరైతే హేళన కూడా చేశారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ పాన్ వరల్డ్ స్టార్‌గా ఎదిగాడు. నాకు చాలా గర్వంగా ఉంది.’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టుకొచ్చింది.