Industry Hits : టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్ కోసం చాలామంది స్టార్ హీరోలు ఎదురు చూస్తూ ఉంటారు. అసలు ఇండస్ట్రీ హిట్ అంటే ఏదైనా సినిమా భారీ స్థాయిలో విజయాన్ని సాధించి అంతకుముందు వచ్చిన ఏదైనా పెద్ద సినిమాను క్రాస్ చేస్తే దాన్ని ఇండస్ట్రీ హిట్ గా పరిగణములోకి తీసుకొని వస్తారు. ఇప్పుడు అలా టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ దక్కించుకున్న సినిమాల వైపు ఒక లుక్కేద్దాం.
అక్కినేని నాగేశ్వరావు గారికి బాలరాజు అనే సినిమా ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది. ఆ తర్వాత కీలుగుఱ్ఱం అనే సినిమా ఏఎన్ఆర్ కి ఇండస్ట్రీ హిట్ ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత దేవదాసు సినిమా అప్పటి ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని ఇండస్ట్రీ హిట్ తో ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత రోజులు మారాయి సినిమా కూడా ఏఎన్ఆర్ గారికి మంచి ఇండస్ట్రీ హిట్ దక్కించింది .
ఇక సీనియర్ ఎన్టీఆర్ కి మాయాబజార్ సినిమా అది పెద్ద ఇండస్ట్రీ హిట్ ను సంపాదించి పెట్టింది. ఆ తర్వాత దసరా బుల్లోడు అనే సినిమా అక్కినేని నాగేశ్వరావు గారికి అతిపెద్ద ఇండస్ట్రీ హీట్ ను తెచ్చి పెట్టింది. అదేవిధంగా చిరంజీవి పసివాడి ప్రాణం అనే సినిమా భారీ స్థాయిలో ఇండస్ట్రీ హిట్ తెచ్చిపెట్టింది. అప్పట్లోనే ఈ సినిమా నాలుగు కోట్ల 70 లక్షలకు పైగా వసూలు చేసింది. తర్వాత జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా 6 కోట్ల వరకు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఇక ఘరానా మొగుడు , గ్యాంగ్ లీడర్ అనే సినిమాలు కూడా చిరంజీవికి అతిపెద్ద ఇండస్ట్రీ హీట్ ను దక్కించిపెట్టాయి. ఇక 2002లో వచ్చిన ఇంద్ర సినిమా 25 కోట్ల షేర్ మార్కెట్ ను వసూలు చేసి అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక సీనియర్ ఎన్టీఆర్ లవకుశ సినిమా అప్పట్లో భారీ స్థాయి విజయనందించి పెట్టి అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.