Tollywood: ఆ మోజు వల్లే ముసలి హీరోలు కుర్ర హీరోయిన్లను కావాలంటున్నారా?

Tollywood: వయసు ఎక్కువగా ఉన్న వారు.. తమకంటే తక్కువ వయసున్న వారితో రొమాన్స్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారట. దానికి ప్రత్యేక కారణం ఉంటుందని ప్రముఖులు చెబుతున్నారు. తక్కువ ఏజ్ ఉన్నవారితో సరసాలాడితే.. ఏజ్ బార్ అయిన వారికి బాగా ఊపొస్తుందని ప్రముఖులు అంటున్నారు. అన్నీ రంగాల్లో ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది. సినీ ఇండస్ట్రీలోనూ ఇదే తేడాను గమనించవచ్చు. ఇప్పటికే చాలా మంది సీనియర్ హీరోలు తమకంటే తక్కువ వయసు ఉన్న హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు. అది చూసిన ప్రేక్షకులు మండిపడుతుంటారు. సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మాస్ మాహారాజా రవితేజ, విక్టరీ వెంకటేష్, నాగార్జున ఇదే వరుసలో వస్తారు. తమకంటే చిన్న వయసు వారితో తెరను పంచుకుంటున్నారు. నిజం చెప్పాలంటే తమ కూతురి వయసు వారిని అని చెప్పుకోవచ్చు. ఈ విషయంపై పలువురు ఆరోపించినా.. అవేవీ పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నారు.

 

 

గతంలో ఆర్తి అగర్వాల్, శ్రీయ శరణ్‌లతో మన సీనియర్ హీరోలందరూ రొమాన్స్ చేశారు. ఇప్పుడీ జాబితాలో కృతిశెట్టి, శ్రీలీల తదితర యంగ్ హీరోలు వస్తున్నారు. వీరితో నటించాలని సీనియర్ హీరోలందరూ మనసు పారేసుకుంటున్నారట. మాస్ మహారాజా రవితేజ.. మాళవిక శర్మ, శ్రీలీల తదితర యంగ్ హీరోలతో రొమాన్స్ చేస్తున్నారు. అయితే కుర్ర హీరోలతో సీనియర్ హీరోలు నటించడానికి ఒక కారణం ఉందట. వారితో నటిస్తే.. ఫుల్ జోష్, ఉత్సాహం వస్తుందని సమాచారం. సీనియర్ హీరోల్లో ఆ ఊపు బాగా వస్తుందట. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టే కుర్ర హీరోలు మంచి ఊపు మీద ఉంటారని, ఎలాంటి సన్నివేశాల్లో నటించడానికైనా సిద్ధంగా ఉంటారని సమాచారం. వారితో సినిమా చేస్తే.. తెలియని ఉత్సాహం వస్తుందట. అందుకే వారితో కలిసి నటించడానికి సీనియర్ హీరోలు ఉత్సాహం చూపిస్తారని తెలుస్తోంది. రొమాన్స్ లోనూ వెనకడుగు వేయకుండా దూసుకెళ్తారట. ఆ సీన్స్ ఎదుటి వ్యక్తికి ఇబ్బందిగా అనిపించినా.. వయసు తేడా ఉన్నా.. సినిమాలో భాగమే అని, ఎలాంటి పుకార్లను పట్టించుకోకుండా ముందుకెళ్తారట. అందుకే మన సీనియర్ హీరోలు కుర్ర హీరోలతో సినిమా చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు ప్రముఖులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -