Tollywood: ఆ హీరోయిన్ సక్సెస్ కావడానికి సౌందర్య మరణమే కారణమా?

Tollywood: టాలీవుడ్ పరిశ్రమలో హోమ్లీ హీరోయిన్ గా సౌందర్య మంచి పేరు తెచ్చుకుంది. అప్పట్లో ఆమె సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతగానో నచ్చేవి. ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో సౌందర్య నటించి మెప్పించారు. తెలుగు, కన్నడం భాషల్లో ఆమె నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా అందరి స్టార్స్ తో ఆమె జతకట్టారు. పద్దతిగా ఉండే సౌందర్య అంతే పద్దతిగా ఉండే పాత్రల్లోనే కనిపించారు. అందుకే ఆమెను అందరూ తెలుగింటి ఇల్లాలు అంటూ ఉండేవారు.

 

పేరుకి కన్నడ బ్యూటీ అయిన సౌందర్య బాగా పాపులారిటీని మాత్రం తెలుగు చలన చిత్ర పరిశ్రమ ద్వారానే తెచ్చుకున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఆమె మన మధ్య లేకపోయినా ఆమె సినిమాలు మాత్రం ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. సౌందర్య ఓ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సౌందర్య ఓ మీటింగ్ కు వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురై చనిపోయారు. సౌందర్య మరణం పట్ల అందరూ బాధను వ్యక్తం చేశారు. అయితే సినీ ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరోయిన్ కి మాత్రం సౌందర్య మరణం ప్లస్ అయ్యిందనే వార్త అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

 

హీరోయిన్ స్నేహ గురించి అందరికీ తెలిసిందే. సౌందర్య తర్వాత హోమ్లీ బ్యూటీ గా స్నేహకు పేరుంది. సినీ కెరీర్ లో ఈమె అన్నీ హోమ్లి పాత్రలే వేేస్తూ వచ్చారు. పద్ధతిగా చీర కట్టినా తలలో పూలు పెట్టినా నుదుట బొట్టు పెట్టినా స్నేహ అద్భుతంగా కనిపించేవారు. అందుకే ఆమెపై చాలా మంది కుర్రాళ్లు మనసు పారేసుకున్నారు. సౌందర్య చనిపోయిన తర్వాత ఆమె ప్లేస్ ను రీప్లేస్ చేసే హీరోయిన్ స్నేహ మాత్రమే అని అందరూ అనుకున్నారు. అదే ప్రశ్నను స్నేహకు ఎదురైంది.

 

సౌందర్య మరణించడం తనకు పాజిటివ్ కాదని, సినీ ఇండస్ట్రీకే ఆమె లేని లోటు ఎవ్వరూ తీర్చలేరని స్నేహ చెప్పుకొచ్చింది. హీరోయిన్ గా అవకాశాలు వస్తూపోతూ ఉంటాయని, సౌందర్య వల్ల తనకు అవకాశం రాలేదని ఆమె ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దీంతో చాలా మంది ప్రశ్నలకు స్నేహ చెక్ పెట్టారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -