Tollywood: ఛాన్స్ ల కోసం పడుకోవడంలో ఏ మాత్రం తప్పు లేదు!

Tollywood: చాలా మంది సెలబ్రిటీలో సినిమాలో కంటే కొన్ని షోల ద్వారా కూడా ఫేమస్ అవ్వుతూ ఉంటారు. అలా బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయిన వారి లో దివి వాద్యా కూడా ఉన్నారు. దివి మోడలింగ్ నుంచి తన కెరీర్ ను మొదలు పెట్టారు. మోడలింగ్ చేస్తూనే ‘లెట్స్ గో’, ‘సీన్ నెంబర్ 72’ సహా పలు సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు. ఆ సినిమాల ద్వారా ఆమెకు మంచి ఫాలోయింగ్ వచ్చిందని చెప్పాలి. దివి చూడటానికి ముంబై హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.

 

అందుకే దివి అందాలకు చాలామంది ఫిదా అయిపోవడంతో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అప్పట్లో మహేశ్ బాబు సినిమా మహర్షిలో కూడా దివి కీలక పాత్రలో కనిపించారు. అయితే ఆమెకు ఫేమ్ మాత్రం బిగ్ బాస్ ద్వారానే వచ్చిందని చెప్పొచ్చు. బిగ్ బాస్‌ లో తన ఆటతో పాటు అందచందాలతో దివి అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా గాడ్ ఫాదర్‌ సినిమాలో కూడా ఆమె ఓ ప్రధాన పాత్రే పోషించదని చెప్పాలి.

 

ఇకపోతే మీటూ ఉద్యమం అప్పట్లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. అనేక మంది నటీమణులు కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఓపెన్‌ గానే షాకింగ్ విషయాలను వెల్లడించారు. తాజాగా దివి వాద్యా కూడా అలాంటి కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ప్రతి ఒక్కరికీ కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఎదురవుతుందని, కానీ కొందరు మాత్రం తమకు ఎదురు కాలేదంటూ అబద్దాలు ఆడుతారని దివి చెప్పుకొచ్చింది.

 

సెలబ్రిటీలుగా చాలామంది ఎదగాలని అనుకుంటారని, అయితే అలాంటి వారు కమిట్‌ అయినా కూడా తన దృష్టిలో అస్సలు తప్పులేదని, ఎందుకంటే ఎవరి లైఫ్‌ వారిది అని దివి చెప్పుకొచ్చారు. ఒకవేల బలవంతం చేస్తేనే తప్పు అని, ఇష్ట పూర్వకంగా చేసే పనులు అస్సలు తప్పు కాదని దివి వాద్యా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -