Tollywood: భారీ నష్టాలతో సినిమాలను రిలీజ్ చేస్తున్న నిర్మాతలు.. ఏమైందంటే?

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా రెండు సినిమాల పేర్లు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి కానుకగా రెండు భారీ సినిమాలు విడుదల కానున్నాయి. మైత్రీ మీడియా సంస్థ ఇందులో ఓ భారీ సినిమాను విడుదల చేస్తోంది. అందులో ముఖ్యంలో బాలయ్య నటించిన సినిమా వీరసింహారెడ్డి మరొకటి చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు కావడం విశేషం. బాలయ్య సినిమా వీరసింహారెడ్డికి వంద కోట్ల వరకూ బడ్జెట్ అయ్యిందని చెప్పాలి. ఇకపోతే దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేయించాడని, బడ్జెట్ ముందు అనుకున్నదానికన్నా ఇప్పుడు భారీగానే పెరిగిపోయిందని టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.

 

బాలయ్య మార్కెట్ కు మించి నిర్మాతలు ఖర్చు చేశారని, ముఖ్యంగా వర్కింగ్ డేస్ లెక్కకు మించి పెరిగినట్లుగా తెలుస్తోంది. వడ్డీల సంగతి అటు ఉంచితే అంత వరకూ మార్కెట్ అవుతుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వర్కింగ్ డేస్, ప్రొడక్షన్ ఖర్చుతో పాటుగా ఈ సినిమాకు భారీ రెమ్యూనిరేషన్లు కూడా యాక్టర్లు అందుకున్నట్లు తెలుస్తోంది.

 

వాల్తీరు వీరయ్య సినిమాకు అటు మెగాస్టార్ చిరంజీవి, ఇటు మాస్ మహారాజ రవితేజ‌ దగ్గరి నుంచి టెక్నికల్ టీమ్ వరకు అందరూ భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఇక్కడ మరో సమస్య వచ్చిపడింది. రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం వల్ల డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి వచ్చే మొత్తాలు కూడా తక్కువగానే ఉంటాయి. కలెక్షన్ల మీద కూడా భారీగానే ప్రభావం పడనుంది.

 

రెండు సినిమాల నాన్ థియేటర్ హక్కులు చాలా కాలం ముందే క్లోజ్ అయ్యాయని అందరికీ తెలుసు. పైగా ముందుగా అనుకున్న ప్రకారం కన్నా రెమ్యునరేషన్లు కూడా కొంత పెరిగాయనే చెప్పాలి. అందువల్ల ఈ రెండు సినిమాలు విడుదల నాటికి బ్రేక్ ఈవెన్ కావడం అన్నది కాస్త కష్టమేనని సినీ పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. నైజాంలో రెండు సినిమాలు కలిసి 40 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉండగా అలాగే ఏపీలో నలభై కోట్ల మేరకు వసూల్లు రాబట్టాలి. అప్పుడే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్ లోకి వెళ్తారు.

Related Articles

ట్రేండింగ్

YS Avinash Reddy Vs YS Sunitha: అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ సునీత.. కడపలో వైసీపీ మునగటానికి ఇంకేం అక్కర్లేదా?

YS Avinash Reddy Vs YS Sunitha: కడప పార్లమెంట్ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. 2019 ఎన్నికలకు ముందు వయసు వివేకానంద రెడ్డి దారుణంగా హత్యకు...
- Advertisement -
- Advertisement -