Tollywood: ఆమె వయసు 55, అతని వయసు 43.. కొత్త రిలేషన్! అసలు మ్యాటర్ ఏంటో తెలుసా?

Tollywood: సీనియర్ కమెడియన్ ఆలీ ఈటీవీలో ఓ షో నిర్వహిస్తున్నారు. చాలా కాలంగా ఇది ప్రసారమవుతోంది. ఈటీవీలో ఆలీతో సరదాగా పేరిట ఈ షో వస్తోంది. సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలను పలువుర్ని ఈ షోకు ఆహ్వానిస్తూ ఉంటాడు ఆలీ. షోకు వచ్చే గెస్టులే ఆశ్చర్యపోయేలా ఒక్కోసారి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు ఆలీ. ప్రముఖ హీరోలు, హీరోయిన్లు కూడా వస్తుంటారు. సీనియర్ హీరోయిన్లు, వెటరన్ నటులు సైతం ఆలీతో షోకు విచ్చేస్తుంటారు. మ్యూచువల్‌గా ఇద్దరు నటీనటులు కూడా హాజరవుతుంటారు.

ఈ నేపథ్యంలో ఒక ఆడ, మగ సెలబ్రిటీలు ఒకే వేదికపైకి వచ్చారంటే ఇక రూమర్లు క్రియేట్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఆలీ చాలా చిలిపి ప్రశ్నలు సంధిస్తుంటాడు. షోను ఉత్సాహంగా నడుపుతుంటాడు. ఇటీవల ఈ షోకు సీనియర్ నటి తులసి వచ్చారు. ఈమెతో పాటు మరో క్యారెక్టర్ ఆర్టిస్టు, ప్రభాస్ అసిస్టెంట్ గా సినీ పరిశ్రమలో పాపులర్ అయిన ప్రభాస్ శ్రీను వచ్చారు.

షోకు ఈ ఇద్దరినీ పిలవడంపై రూమర్లు జోరందుకున్నాయి. సినీ పరిశ్రమలో ఆడ, మగ సెలబ్రిటీలు కొంచం క్లోజ్ గా మసలుకుంటే అంతే సంగతులు. వారిపై బోలెడు పుకార్లు పుట్టుకొస్తాయి. తాజాగా నటి తులసి, నటుడు ప్రభాస్ శ్రీనుపై కూడా పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి.

ఆలీ చేసిన పనేనా?
ఆలీతో సరదాగా షో రీసెంట్ ప్రోమోలో ఈ ఇద్దరితో ముచ్చటించాడు ఆలీ. తులసి వయసు ప్రస్తుతం 55. ప్రభాస్ శ్రీను వయసు 43 ఏళ్లు. వీరిద్దరూ కలిసి షోకు రావడంతో కాస్త ఇంట్రస్టింగ్ గా మారింది. దీనికి తోడు అప్పట్లో డార్లింగ్ చేశాం కదా.. అప్పుడే ఈవిడ తగిలిందంటూ ప్రభాస్ శ్రీను ప్రోమోలో చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇక గాసిప్ రాయుళ్ల తమ కలానికి పని చెబుతున్నారు. షోలో జరిగిందేమిటో, ఆ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందా? లేక యాక్టర్, మేనేజర్ లాంటి బంధమా? ఇంకేమైనా ఉందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇవి తెలుసుకోకుండానే గాసిప్స్ మొదలయ్యాయి. షోకు మరింత ఆదరణ లభించాలని ఆలీనే ఇలా చేయించాడనే వార్తలూ వస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరు మార్చిన చంద్రబాబు.. కొత్త పేరు ఏంటో తెలుసా?

Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాగళం పేరిట ఈయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అధికార ప్రభుత్వంపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -