Tollywood: ఈ ఏడాది రికార్డులు క్రియేట్ చేసిన చిన్న బడ్జెట్ సినిమాలివే!

Tollywood: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో విడుదలయ్యే సినిమాలో కొన్ని సూపర్ హిట్ గా నిలిస్తే, మరికొన్ని ఫ్లాప్ అవుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ లుగా నిలుస్తూ ఉంటాయి. మరికొన్ని సినిమాలో చిన్న సినిమాలుగా విడుదల అయ్యే బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ ను సాధిస్తుంటాయి. మరి ఈ ఏడాది 2022 లో చిన్న బడ్జెట్ తో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు సాధించిన సినిమాల వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కన్నడ నటుడు రిషబ్ శెట్టి దర్శకుడిగా వ్యవహరిస్తూ హీరోగా నటించిన సినిమా కాంతార.

 

కేవలం 16 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అలాగే ఇటీవలే విడుదలైన కార్తికేయ 2 సినిమా కూడా చిన్న సినిమాగా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ ను సాధించింది. 30 కోట్లతో నిర్మితమైన కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ను అందుకొని 125 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. హిందీ డబ్బింగ్ వెర్షన్ 30 కోట్లకు పైగా వసూలు చేసింది.

 

దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన కాశ్మీర్ ఫైల్స్ సినిమా కూడా బాధిత విశ్వ వద్ద భారీగానే కలెక్షన్స్ ను సాధించింది. కేవలం 15 కోట్ల అతి చిన్న బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా దాదాపుగా 330 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన సీతారామం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ ను సాధించింది. 30 కోట్లతో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 91.4 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూలను సాధించిన సినిమాలలో మరో కన్నడ చిత్రం 777 చార్లీ. రక్షిత్ శెట్టి ఇందులో ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా 150 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -