Tollywood: సినిమాలు కాకుండా మన హీరో హీరోయిన్లు చేసే బిజినెస్‌లు ఇవే!

Tollywood: ఒక సినిమా రిలీజ్ అంటేనే ముందుగా ప్రేక్షకులంతా మాట్లాడుకొనే మాట ఏమిటంటే ఆ సినిమాలో హీరో, హీరోయిన్ ఎవరు అని, ఈ హీరో, హీరోయిన్ లు ఒక పక్క సినిమాలు చేస్తూ మరొక్క ప్రక్క తమ దైన శైలిలో వ్యాపారం చేస్తుంటారు. అలా కొంతమంది నేరుగా వ్యాపారంలోకి దిగితే.. మరికొంతమంది పరోక్షంగా పెట్టుబడి పెట్టి కొన్ని ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఇంతకూ వ్యాపారం చేస్తున్న ఆ హీరో, హీరోయిన్లు ఎవరు వారు ఎటువంటి వ్యాపారచేస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవాలని ఆతృతగా ఉందా అయితే కింద తెలుసుకోండి.
ర‌ష్మిక మంద‌న్న‌:
ఇటీవలే ‘పుష్ప’ సినిమాతో  దేశవ్యాప్తంగా క్రేజ్‌ తెచ్చుకున్న నటి రష్మిక మందన్న. హీరోయిన్లు ఎక్కువగా మేకప్ చేసుకొంటారు. కొన్నిమేకప్ లు చర్మ సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. చర్మ సంబంధిత సమస్యల నుండి చర్మ సంరక్షణకు వేగన్‌ స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ ‘ప్లమ్‌గాడ్సెస్‌’ ఉత్పత్తులనే ఆమె ఎక్కువగా వినియోగిస్తుంది. ఇది అందరికి ఎంతో మేలు చేస్తుందనే నమ్మకంతో ఇమె  పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తుంది.అంతేకాదు, ఆ బ్రాండ్‌కు తనే అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నదని తెలిపింది.
తమన్నా:
హ్యాపిడేస్ ,బాహుబలి,లాంటి ఎన్నో హిట్ సినిమాలను అందుకున్న మిల్కీ బ్యూటి తమన్నా. ఇమె కూడా ఒక ఒక పక్క సినిమాలు చేస్తూ మరొక్క ప్రక్క వ్యాపారం చేస్తూ కొన్ని కాస్మటిక్స్‌ ఉత్పత్తులకు
బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంది. ఇమె స్వదేశీ బ్యూటీ ఉత్పత్తుల కంపెనీ అయిన ‘షుగర్‌ కాస్మటిక్స్‌’లో ఇన్వెస్టర్‌గా ఉంది. తమన్నా వంటి గ్లామర్‌ తారలతో ఉత్పత్తులను ప్రచారం చేయడం వల్ల తాను నంబర్‌ వన్‌ స్థానాన్ని పొందడంతో పాటు ఆ బ్రాండ్‌ కూడా అగ్రస్థానంలోనే ఉంటుందని కాన్ఫిడెంట్‌గా ఇమె గురించి రణ్‌వీర్‌ ప్రస్తావించడం జరిగింది.
రానా దగ్గుబాటి
ఒక పక్క హీరోయిన్లు స్త్రీ ల కోసం కాస్మటిక్స్‌ ఉత్పత్తులను అందిస్తుంటే అదే తరుణంలో తెలుగు హీరో రానా దగ్గుబాటి పురుషుల కోసం కూడా కొన్ని ప్రత్యేకమైన సౌందర్య సాధనాలను అందిస్తున్నారు .ఆయన ఆలోచనకు రోపోసో సంస్థ సహాయంచేసింది. ఫలితంగా రోపోసోతో కలిసి ‘డిక్రాఫ్‌’ బ్రాండ్‌ పేరుతో పురుషుల కాస్మటిక్‌ ఉత్పత్తుల పరిశ్రమలోకి రానా అడుగుపెట్టారు. ఇదొక డీ2సీ బిజినెస్‌. షేవింగ్‌ క్రీమ్స్‌, చర్మ సౌందర్య సాధనాలు వంటివి ఈ బ్రాండ్‌లో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ముఖం, గడ్డం, చర్మ సంరక్షణ ఉత్పత్తులను మార్కెట్‌ చేయగలుగుతున్నానని  చెప్పారు రానా. ఇప్పటివరకూ ఇతర బ్రాండ్స్‌కు ప్రచారం కల్పిస్తున్న రానా.. తన బ్రాండ్‌కు కూడా తనే అంబాసిడర్‌గా ఉన్నారు. ర‌ష్మిక మంద‌న్న‌,తమన్నా,రానా దగ్గుబాటి ,రణ్‌వీర్‌ సింగ్‌ లతో పాటు, నయనతార,ప్రియాంక చోప్రా,శృతిహాసన్‌ వంటి  హీరో, హీరోయిన్ లు కూడా వ్యాపారంలో దుసుకొనిపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Botsa Satyanarayana: కూటమికి ఓటేస్తే స్టీల్‌ప్లాంట్‌ని రక్షించలేమట.. అధికారంలో ఉండి ఏం చేశారు బొత్స గారు?

Botsa Satyanarayana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. అయితే చాలా చోట్ల వీరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందని తెలుస్తుంది. ఈ...
- Advertisement -
- Advertisement -