Tollywood: టాలీవుడ్ హీరోల పరువు తీసిన సినిమాలు ఇవే.. వీటి వల్లే ఇంకా ఇలా!

Tollywood: ప్రతి స్టార్ హీరో కెరియర్ లో సూపర్ హిట్ సినిమాలతో పాటు డిజాస్టర్ సినిమాలు కూడా ఉంటాయి. సూపర్ హిట్ అయిన సినిమాల సంగతి పక్కన పెడితే డిజాస్టర్ అయిన సినిమాలు రిలీజ్ డేట్ అలాగే ఇతర పొరపాట్ల కారణంగా డిజాస్టర్ గా నిలుస్తూ ఉంటాయి. అలా హీరోలకి కెరిర్ లో మరికొన్ని సినిమాలో అభిమానులు తలదించుకునే విధంగా ఉంటాయి. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరియర్ లో  సుబ్బు, నాగ, ఆంధ్రావాలా, నా అల్లుడు, నరసింహుడు, శక్తి, రామయ్యా వస్తావయ్యా, రభస లాంటి సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. అదేవిధంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో వంశీ, నిజం, సైనికుడు, 1 నేనొక్కడినే, ఆగడు లాంటి సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో జానీ, బాలు, కొమరం పులి, తీన్ మార్, అజ్ఞాతవాసి లాంటి సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి.  అలాగే టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరిర్ లో రాఘవేంద్ర,యోగి, మున్నా, ఏక్ నిరంజన్, రెబల్, సాహో, రాధేశ్యామ్ వంటి సినిమాలు డిజాస్టర్ లుగా నిలిచాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో కూడా ఆరెంజ్, తుఫాన్, బ్రూస్ లీ, వినయ విధేయ రామ, ఆచార్య వంటి సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి.

అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరిర్ లో కూడా హ్యాపీ, వరుడు, ఇద్దరమ్మాయిలతో, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా లాంటి సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. అదేవిధంగా టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన నాగార్జున, బాలకృష్ణ నటించిన సినిమాలలో 20 సంవత్సరాలలో హిట్టైన సినిమాల కంటే ఫ్లాప్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. వీరితోపాటుగా వెంకటేష్ చిరంజీవి కెరియర్ లో కూడా పలు సినిమాలో డిజాస్టర్ గా నిలిచాయి. కేవలం ఈ హీరోల సినిమాలో మాత్రమే కాకుండా ఇంకా టాలీవుడ్ లో ఎంతో మంది హీరోల కెరిర్ లో డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -