Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలోని హీరోలు అన్ని రకాలుగా పోటీపడుతుంటారు. ఒక హీరో సినిమా కంటే మరో హీరో ఇంకా మంచి సినిమా చేయాలని పోటీ పడుతుంటారు. ఇందుకోసం ఎంత కష్టపడటానికైనా సిద్ధమైపోతుంటారు. ఈ పోటీ వల్లే ఇప్పుడు దేశంలోనే తెలుగు ఇండస్ట్రీ నెంబర్ వన్ సినీ ఇండస్ట్రీగా మారింది.
టాలీవుడ్ లోని టాప్ హీరోల జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ఖచ్చితంగా ఉంటారు. వీళ్ల సినిమాలు రికార్డులు బ్రేక్ చేస్తుండగా.. వీరి మధ్యన తాజాగా జరిగిన ఓ పోటీలో మహేష్ ను ఎన్టీఆర్ క్రాస్ చేశాడనే వార్త అందరిలో చర్చకు దారితీసింది.
కేవలం సినిమాలతోనే కాకుండా యాడ్స్ చేస్తూ మహేష్ బాబుతో పాటు అల్లు అర్జున్ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. తెలుగులో ఎక్కువ యాడ్స్, యాడ్స్ కోసం ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా మహేష్ బాబు ఉన్నాడు. అయితే తాజాగా మహేష్ బాబును వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లోకి యంగ్ టైగర్ చేరినట్లు తెలుస్తోంది.
ప్రముఖ కంపెనీ లీసియస్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా.. ఈ కంపెనీ యాడ్ కోసం ఎన్టీఆర్ కు భారీ మొత్తం అందిందట. ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ యాడ్ కోసం ఎన్టీఆర్ కు కోటి యాభై లక్షలు ముట్టినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో టాప్ లో ఉన్న మహేష్ బాబు కన్నా ఎన్టీఆర్ భారీ రెమ్యునరేషన్ తీసుకొని యాడ్ చేయడంతో ఆయనే ఇప్పుడు నెంబర్ వన్ అయ్యాడు. మొత్తానికి ఎక్కడున్నా నెంబర్ వన్ గా ఎన్టీఆర్ ఉంటాడంటూ ఆయన ఫ్యాన్స్ ఈ విషయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.