Tollywood: బాలలు నటించి బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచిన సినిమాలివే!

Tollywood: ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా వరకు సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ వల్లే హిట్లు అయ్యాయి. సినిమాలకు మహారాజ పోషకులు యంగ్ హీరోలు కాదు ఈ బాలలే. సాధారణంగా యంగ్ హీరోల సినిమా చూడటానికి అనుకుంటే ఫస్ట్ డే వెళ్తాం. సినిమా బాగుందని అనిపిస్తే మరోసారి చూసివస్తాం. కానీ సింగిల్‌గా లేదా ఫ్రెండ్‌ని తీసుకుని వెళ్తాం. అయితే చిన్న పిల్లల సినిమా అనుకోండి.. ఫ్యామిలీ మొత్తం చూడాలని ఆసక్తి చూపుతారు. ఫ్యామిలీతో వెళ్లినప్పుడు ఒక టికెట్‌ తీసుకోవాల్సిన చోట నాలుగు, ఐదు టికెట్లు తీసుకోక తప్పదు. వసూళ్లు రాబట్టాలన్న బాలలు ఉండాల్సిందే.. అందుకేనేమో.. తెలుగు సినిమాలు ప్రారంభమైనప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్టులను డైరెక్టర్లు తమ సినిమాల్లో అవకాశాలు కల్పిస్తారు.

 

అప్పట్లోనే..

తెలుగు మొట్టమొదటి టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’లో ప్రధాన పాత్ర బాలుడిదే. 1932లో విడుదలైన ఈ సినిమాలో బాలనటుడిగా కృష్ణారావు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ‘లవ కుశ, శ్రీకృష్ణ లీలలు’ వంటి సినిమాల్లో బాలల నటన అందరినీ అలరించాయి. అప్పట్లో నాటకీయ సినిమాల హవా కొనసాగేది. 1942లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘బాల నాగమ్మ’ సినిమాలో బాలవర్ధి రాజుగా నటించిన మాస్టర్ విశ్వం కూడా తన నటనతో భలే అనిపించాడు. ‘భలే పోతన’లో పోతన కూతురుగా నటించిన బేబీ వనజ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘స్వర్గసీమ, త్యాగయ్య’ సినిమాల్లో బాలల పాత్రలు విశేషమైన ఆదరణలు పొందాయి. స్టార్ ఎన్టీఆర్ నటించిన ‘పాతాళ భైరవి’ సినిమాలోనూ పసివాళ్లను అలరించే అంశాలు చిత్రీకరించారు. 1952లో మాస్టర్ కందు నటించిన సినిమా ‘పెళ్లి చేసి చూడు’ కూడా అందరినీ ఆకట్టుకుంది.

మాయాబజార్, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం, పెళ్లి కానుక వంటి సినిమాల్లో చిన్నపిల్లలు పలు అంశాలను ఇట్టే కనుక్కున్నారు. ‘పరమానందయ్య శిష్యుల కథ, లేత మనసులు, ఉమ్మడి కుంటుంబం, రాము, మనుషులు మారాలి, దసరా బుల్లోడు, పండంటి కాపురం, బ్రహ్మంగారి చరిత్ర, పసివాడి ప్రాణం, ముద్దుల మామయ్య, జగదేకవీరుడు అతిలోక సుందరి, సమర సింహారెడ్డి, కలుసుందాం రా’ తదితర సినిమాల్లో బాల నటులు తమ పాత్రలను న్యాయం చేశారు. తాజా సినిమాలైన బహుబలి, ఈగ, ఆర్ఆర్ఆర్, అఖండ, వంటి సినిమాల్లో నటించిన చైల్డ్ ఆరిస్టులు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -