Tollywood: వీరయ్య, వీరసింహారెడ్డి పాటలపై ప్రేక్షకుల రెస్పాన్స్ ఇదే!

Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి ఎంతో స్పెషల్. సంక్రాంతి బరిలో దిగే సినిమాల్లో చాలా వరకు వర్కవుట్ అవుతాయి. అందుకే పెద్ద హీరోలు సంక్రాంతిని అస్సలు మిస్ చేయాలని అనుకోరు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి నందమూరి బాలయ్య, మెగాస్టార్ చిరంజీవిలు బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నారు.

 

నందమూరి బాలయ్య, మెగాస్టార్ చిరంజీవిల అభిమానులే వాళ్ల సినిమాలకు డైరెక్టర్లుగా ఉండటంతో.. ఈ రెండు సినిమాల మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రెండు కూడా మాస్ సినిమాలు కావడంతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత ఇలా ఇద్దరు స్టార్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతుండటంతో అందరిలో ఆసక్తి పెరిగింది.

 

అయితే అభిమానులను ఖుషీ చేయడానికి అంటూ బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమా నుండి ‘జై బాలయ్య’ పాటు, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ నుండి ‘బాస్ పార్టీ’ పాటలు విడుదలయ్యాయి. ఈ రెండు పాటల మీద నెటిజన్ల నుండి తీవ్ర కామెంట్లు వస్తున్నాయి. మరీ ఇంత చెత్త పాటలు ఎలా పెట్టారంటూ నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

దేవిశ్రీ ప్రసాద్ చిరంజీవి కోసం కంపోజ్ చేసిన ‘బాస్ పార్టీ’ పాట లిరిక్స్ మీద నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దేవిశ్రీకి లిరిక్స్ రాయడం రాకపోతే వదిలెయ్యాలి కానీ చిరాకు తెప్పించేలా రాస్తే ఎలా అని కామెంట్ చేస్తున్నారు. లిరిక్స్ ఎలాగూ దొబ్బాయ్ అనుకుంటే పాట కూడా ఏదో పాత పాటకు కాపీలా ఉందనే కామెంట్లు ఉన్నాయి.

 

అటు బాలయ్య కోసం తమన్ ‘జై బాలయ్య’ మీద కూడా అదే తరహా కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘ఒసేయ్ రాములమ్మ’ పాటను తిరిగి కంపోజ్ చేసినట్లు ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ‘వీరసింహారెడ్డి’కి ‘జై బాలయ్య’కు లింకేంటి అని అడుగుతున్నారు. ఇక ఈ పాటకు లిరిక్స్ రాసిన రామజోగయ్య శాస్త్రి కూడా లిరిక్స్ చండాలంగా రాశాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -