Tollywood: అప్పట్లో.. ఇప్పట్లో.. ఎప్పుడైనా టాలీవుడ్ లో సంక్రాంతి అంటే సినీ ప్రియులకు పండగే. సంక్రాంతి బరిలో విడుదల అవడానికి చాలా సినిమాలు వేచి చూస్తూ ఉంటాయి. టాలీవుడ్ లో అప్పట్లో సంక్రాంతి వస్తుందంటే దాదాపు సమ ఉజ్జీలైన పెద్ద హీరోలందరూ తమ తమ సినిమాలతో పోటీ పడుతూ ఉండేవారు. అలా డజన్ల కొద్దీ సినిమాలు రిలీజ్ అయ్యి ఆయా హీరోల అభిమానులకు డబుల్ ధమాకా అందించేవి. అయితే వాటిలో కొన్ని మాత్రమే హిట్ టాక్ తెచ్చుకునేవి. ముఖ్యంగా సంక్రాంతి అంటే నందమూరి, మెగా అభిమానులకు ప్రత్యేక సంబరమే.
అప్పుడే ప్రారంభమైన పోటీ..
ప్రస్తుతం అప్పటి ట్రెండ్ రిపీట్ చేస్తూ.. మళ్ళీ మెగాస్టార్, నందమూరి నటసింహం ఈ సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధమయ్యారు. చిరు వాల్తేర్ వీరయ్య.. బాలయ్య వీర సింహా రెడ్డి సినిమాలతో రెడీగా ఉన్నారు. ఇంకా రిలీజ్ అవ్వడానికి టైమ్ ఉన్నా.. అప్పుడే సినిమాల మధ్య పోటీ మొదలైంది. “వీర సింహా రెడ్డి” సినిమాకు దాదాపు 110 కోట్ల వరకు, అలాగే “వాల్తేర్ వీరయ్య” కు 140 కోట్ల వరకు ఖర్చయిందని అంచనా. ఇక్కడ తేడా రెమ్యూనిరేషన్లే. అయితే బాలయ్య రెమ్యూనరేషన్ 15 కోట్లు కాగా.. మెగాస్టార్, రవితేజ రెమ్యూనరేషన్లు కలిపి దాదాపు 50 కోట్లకు పైగా అయ్యింది.
అయితే ఇప్పుడు అస్సలు ప్రశ్న.. ఈ రెండు సినిమాల మార్కెట్ రేటు పైనే. ఆంధ్ర మొత్తం 35 కోట్లు బాలయ్య సినిమా, 40 కోట్లు చిరంజీవి సినిమా.. రెండు సినిమాలకు 75 కోట్ల మేరకు ఫిక్స్ చేసారు. సీడెడ్ ఏరియాలో చిరంజీవి సినిమా 14.5 కోట్లు బాలయ్య సినిమా 12.5 కోట్లు.. రెండు సినిమాలు కలిపి 27 కోట్ల మేరకు ఫిక్స్ చేసారని సమాచారం. నైజాం చిరు మూవీ 18 కోట్లు, బాలయ్య మూవీ 15 కోట్లు.. అంటే 33 కోట్లు సెట్ చేశారు.
అయితే అన్ని ఏరియాల్లో కూడా నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్ సిస్టమ్ మీద ఇవ్వడం వల్ల.. ఎక్కువ వచ్చే వసూళ్లన్నీ నిర్మాతలకు ఇంకా ఆదాయాన్ని అందిస్తాయి. ఇక అనుకున్నన్ని డబ్బులు రాకపోతే గనుక.. జీఎస్టీ డబ్బులు సుమారు 30కోట్ల వరకు నిర్మాతలే సొంతంగా భరించాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తానికి ఆంధ్ర.. సీడెడ్.. నైజాం కలిపి రెండు సినిమాలు 135 కోట్ల థియేటర్ బిజినెస్ చేసాయి.