Tollywood: చిరంజీవికి ఏం తక్కువ అని ఇలాంటి పని చేస్తున్నాడు?

Tollywood: బాలయ్య చిరంజీవి ఇద్దరు టాలీవుడ్ సూపర్ స్టార్స్ అనడంలో సందేహం లేదు. ఒక క్రమంలో బాక్సాఫీస్ వద్ద ఇద్దరి చిత్రాలు సై అంటే సై అని పోటీ పడ్డ సందర్భాలు ఉన్నాయి. కలెక్షన్స్ రికార్డ్స్ ఇలా వేటిపరంగా తీసుకున్న ఇద్దరు ఒకరికొకరు ఏమాత్రం తీసిపోరు. ఆరు పదుల వయసు దాటుతున్న ఇద్దరికీ ఈనాటికీ టాలీవుడ్ లో క్రేజ్ తగ్గలేదు.

 

ఇప్పటివరకు అంతా బాగానే ఉంది కానీ ఇతని హీరోల్లో చిరంజీవి కాస్త భిన్నంగా వ్యవహరించడం పై ప్రస్తుతం ఇండస్ట్రీలో తెగ గుసగుసలు నడుస్తున్నాయి. మార్కెట్లో తిరుగులేని స్థానం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన ఇంకో హీరో పై ఆధారపడే పరిస్థితి ఎందుకు వచ్చింది అని సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.

అక్కడ మూవీలో బాలయ్య సోలోగా సినిమాను నడిపించిన విషయం అందరికీ తెలిసిందే. మరి అలాంటిది చిరంజీవి గాడ్ ఫాదర్ కోసం బాలీవుడ్ బాక్సాఫీస్ బాద్షా సల్మాన్ స్పెషల్ రోల్ కి పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది. అలాగే ఆచార్యలో ఓ కీలక పాత్ర కోసం రామ్ చరణ్ ను ఎంచుకోవడానికి కారణం ఏమిటి. ఇప్పుడు వాల్తేరు వీరయ్య మూవీ కోసం ఏకంగా రవితేజ నే ఒక ప్రత్యేక పాత్రలోకి తీసుకొస్తున్నారు.

చెప్పడానికి మాత్రమే ఇవి ప్రత్యేక పాత్రలో అతిథి పాత్రలో కానీ సినిమా పరంగా కానే కాదు. ఒకరకంగా చిరంజీవి తన మూవీస్ ని మల్టీస్టారర్ మూవీస్ గా తయారు చేస్తున్నారు అని చెప్పవచ్చు. టాలీవుడ్ లో భారీ మార్కెట్ కలిగిన సూపర్ స్టార్ అయ్యుండి కూడా ఇలా చిరంజీవి వేరే హీరోలతో కలిసి సినిమా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అని అతని అభిమానులు ఆవేదన పడుతున్నారు.

ఆయన ఏరికోరి అలాంటి కథలే ఎంచుకుంటున్నారా? మార్కెట్ను నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారా? లేక పాన్ ఇండియా లెవెల్ లో తన మూవీని తేవాలి అని తాపత్రయపడుతున్నారా? ఈ ప్రశ్నలకు ప్రస్తుతం చిరంజీవి దగ్గర మాత్రమే సమాధానం ఉంది. అసలు ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తున్నారా? దానికి కారణం మాత్రం బరిలోకి దిగుతున్న బాలయ్య చిత్రం అనే చెప్పవచ్చు.

రేపు సంక్రాంతికి వాల్తేర్ వీరయ్యతో వీరసింహారెడ్డి తలపడనున్నారు. ఈ క్రమంలో అందరికన్నా చిరంజీవి చిత్రం పై పడింది. ఇన్నాళ్లు ఇద్దరు సినిమాలు రిలీజ్ అయిన ప్రతిసారి చిరంజీవి వెర్సెస్ బాలయ్య అన్న రేంజ్ లోనే టాక్ నడిచేది. ఇటు బాలయ్య వీరసింహారెడ్డిలో స్పెషల్ అట్రాక్షన్ కేవలం బాలకృష్ణ మాత్రమే. కానీ చిరంజీవి వాల్తేరు వీరయ్య లో చిరుతోపాటు రవితేజ కూడా కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు రవితేజాది కేవలం ఒక గెస్ట్ రోల్ అని మాత్రమే పుకారు ఉండేది. కానీ మొన్న రిలీజ్ అయిన టీజర్ తో ఈ చిత్రంలో రవితేజాకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు అనే విషయం తెలుస్తోంది.

దాంతో బాలయ్యను ఎదుర్కొనేటందుకు చిరంజీవి రవితేజ ను సహాయంగా తెచ్చుకుంటున్నాడు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు సంక్రాంతి పోటీల్లో బాలయ్య గెలిచిన చిరంజీవి గెలిచిన ,ఇబ్బంది ఒకరకంగా చిరంజీవి కనే చెప్పొచ్చు. ఒకవేళ బాలయ్య గెలిస్తే సింగిల్ హ్యాండ్ తో అటు రవితేజా ని ఇటు చిరంజీవిని మట్టి కరిపించిన బాలయ్య అని రికార్డు సృష్టిస్తాడు. ఒకవేళ చిరంజీవి గెలిస్తే బాలయ్యను నేరుగా ఎదుర్కోలేక రవితేజ సహాయంతో గెలిచాడు అన్న విమర్శ చిరంజీవి ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది.

ఇప్పటివరకు చిరంజీవి రామ్ చరణ్ తో నటించిన ఆ సల్మాన్ ఖాన్ తో నటించిన ఎదురుకాని విమర్శ కేవలం ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో రవితేజ నటించిన పై ఎందుకు వస్తుంది అంటే దానికి కారణం బాలయ్య సినిమా.

Related Articles

ట్రేండింగ్

Gedela Srinubabu: టీడీపీలోకి గేదెల శ్రీనుబాబు.. వైసీపీ పార్టీకి మరో భారీ షాక్ అయితే తప్పదా?

Gedela Srinubabu: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది జప్పింగ్ జపాంగ్‌లు పెరిగిపోతున్నారు. అన్ని పార్టీల్లో ఇది కామన్‌గా ఉన్నా.. అధికార వైసీపీ నుంచి ఎక్కువ మంది పార్టీని వీడుతున్నారు. ఆ పార్టీకి...
- Advertisement -
- Advertisement -