Tollywood: జూనియర్ ఎన్టీఆర్‌కు జరిగినట్టే మహేష్ బాబుకు జరుగుతోందా?

Tollywood: తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్టార్ హీరో మహేష్ బాబు ఆప్తులు ఒకరి తర్వాత ఒకరు దూరం అయ్యారు. గుండెపోటుతో ఆస్పత్రిలో జాయిన్ అయిన కృష్ణ.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల తుదిశ్వాస విడిచారు. అలాగే ఇందిరాదేవి కూడా అనారోగ్య సమస్యతో ప్రాణాలు విడిచింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో మహేష్ బాబు అన్నయ్య కూడా మృతి చెందాడు. ఈ నేపథ్యంలో కొన్ని విషయాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌కు జరిగిన విషయాలే.. మహేష్ బాబుకు రిపీట్ అయ్యాయి. దాంతో అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

 

 

– 2014లో ఎన్టీఆర్ సోదరుడు నందమూరి జానకిరామ్ మరణించాడు. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా మరణించాడు.

– ఎన్టీఆర్ అన్న చనిపోయిన నాలుగేళ్లకు తండ్రి నందమూరి హరికృష్ణ ఓ ప్రమాదంలో మృతి చెందారు. అలాగే మహేష్ బాబు అన్న చనిపోయిన కొన్ని నెలలకు అతని తల్లి మరణించింది.

– అయితే హరికృష్ణ చనిపోయే టైంకి ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో 28వ సినిమా ‘అరవింద సమేత’ షూటింగ్‌లో ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 29వ సినిమా ‘ఆర్ఆర్ఆర్’లో నటించాడు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు కూడా త్రివిక్రమ్‌తో 28వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ రాజమౌళితో కలిసి 29వ సినిమా చేయబోతున్నారు.

 

 

ఎన్టీఆర్‌కు ఎదురైన పరిస్థితులే మహేష్ బాబుకు ఎదురయ్యాయి. ఈ విషయాలను చూసిన నెటిజన్లు నిజమేనని ఆశ్చర్యపోతున్నారు. ఈ నాలుగు విషయాల్లో ఇద్దరి హీరోలకు పోలికలు కుదరడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -